»   » బాలకృష్ణకు సర్జరీ.. ఆపరేషన్ సక్సెస్.. ‘శాతకర్ణి’ షూటింగ్‌లో గాయం..

బాలకృష్ణకు సర్జరీ.. ఆపరేషన్ సక్సెస్.. ‘శాతకర్ణి’ షూటింగ్‌లో గాయం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి నటసింహం బాలకృష్ణ భుజానికి సర్జరీ విజయవంతమైంది. గత నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలకృష్ణకు శనివారం ఉదయం కాంటినెంటల్ హాస్పిటల్‌లో శస్త్ర చికిత్స నిర్వహించారు. అనంతరం సర్జరీ సక్సెస్ అయినట్టు కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు.

 గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి షూటింగ్

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి షూటింగ్

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్ సందర్భంగా యుద్ధపోరాట సమయంలో బాలకృష్ణ భుజానికి గాయమైంది. ఆ గాయాన్ని రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డ‌ర్ అని వైద్యులు గుర్తించారు. అప్ప‌ట్లో ప్రాథ‌మిక చికిత్స తీసుకున్న ఆయ‌న‌కు మేజ‌ర్ స‌ర్జ‌రీ నిర్వ‌హించాల‌ని వైద్యులు తేల్చారు.

షూటింగ్‌లో బాలకృష్ణ బిజీగా

షూటింగ్‌లో బాలకృష్ణ బిజీగా

అయితే గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం తర్వాత పైసా వసూల్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ షూటింగ్‌లో బిజీగా ఉండటం కారణంగా సర్జరీ చేయించుకోలేకపోయారు. ఆ తర్వాత జై సింహా చిత్ర షూటింగ్‌లో ఉండటం కారణంగా సర్జరీవీలుకాలేదు.

జై సింహ తర్వాత బాలయ్య

జై సింహ తర్వాత బాలయ్య

జై సింహ తర్వాత బాలకృష్ణ తదుపరి చిత్రానికి గ్యాప్ ఉండటంతో సర్జరీకి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో బాల‌క్రిష్ణ శ‌నివారం ఉద‌యం ఎనిమిదిన్న‌గంట‌ల‌ ప్రాంతంలో కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌కు చేరుకున్నారు.

బాలయ్య కుడిభుజానికి సర్జరీ

బాలయ్య కుడిభుజానికి సర్జరీ

అనంతరం బాలకృష్ణకు వైద్యుల బృందం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ దీప్తి నంద‌న్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ (పూణే)తో కూడిన వైద్య సిబ్బంది ఆయ‌న కుడి భుజానికి స‌ర్జ‌రీ నిర్వహించారు.

కొన్ని వారాల విశ్రాంతి

కొన్ని వారాల విశ్రాంతి

బాలకృష్ణకు సర్జరీ జరిగిన గంట‌ తర్వాత ఈ శస్త్ర చికిత్స విజ‌య‌వంత‌మైంద‌ని వైద్యులు తెలిపారు. అనంతరం కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆదివారం లేదా సోమవారం బాలకృష్ణ డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది.

English summary
Nandamuri Balakrishna successfully underwent rotator cuff tear shoulder surgery today in Hyderabad. Doctors at Continental Hospital said that the surgery was successful. Balayya was advised rest for a couple of weeks following the surgery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu