ఎన్టీఆర్ వెన్నుపోటు, లక్ష్మీ పార్వతి వివాదాలపై తెలివిగా సమాధానం చెప్పిన బాలయ్య!
నందమూరి బాలకృష్ణ చాలా రోజుల తరువాత వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారారు. లాక్ డౌన్ లో చాలా రోజులుగా జనాలకు దూరంగా ఉన్న బాలయ్య బాబు ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చి తన సినిమాల గురించి మాట్లాడారు. అలాగే రాజకీయల గురించి కూడా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. అదే విధంగా తన పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని ఘటనలపై కూడా బాలయ్య చాలా తెలివిగా స్పందించారు.

వరుస ఇంటర్వ్యూలు..
బాలకృష్ణ చాలా వరకు మీడియాకు దూరంగానే ఉంటారు. ఆయన ఇంటర్వ్యూలో ఇవ్వడం అనేది చాలా అరుదు. గత వివాదాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారని కేవలం సినిమాలు ఉన్నప్పుడే ప్రమోషన్స్ కోసం వస్తారని ఒక నెగిటివ్ టాక్ ఉంది. అయితే ప్రస్తుతం అలాంటి నెగిటివ్ టాక్ కి ఆయన ఎండ్ కార్డ్ వేసేలా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

మా అభిమానులే..
అనేక విషయాలపై స్పందించిన బాలకృష్ణ ఇంటర్వ్యూలలో ఈ సారి సినిమాల కంటే ఎక్కువగా పాలిటిక్స్ పై ఊహించని విధంగా స్పందించారు. కేసీఆర్ మా నాన్నగారి ప్రియ శిష్యుడు అంటూ.. వైఎస్. జగన్మోహన్ రెడ్డి నా అభిమాని అని రెండు రాష్ట్రాల సీఎంల పై ఒక కామెంట్ కూడా చేశారు. రాజకీయాలు సినిమాలు ఒకటి కాదని చెప్పిన ఆయన మరోవైపు ఏపీ ప్రభుత్వంపై కొన్ని విమర్శలు కూడా చేశారు.

ఆ వివాదాలపై..
ఇక తన తండ్రి నందమూరి తారకరామారావు వివాదాలపై బాలకృష్ణ చాలా తెలివిగా సమాధానం చెప్పారు. ఎక్కడా కూడా వెన్నుపోటు, లక్ష్మీ పార్వతి వివాదాల గురించి స్పందించలేదు. కానీ ఆ వివాదలన్నిటికి కూడా ఒకే ఒక్క మాటతో చెక్ పెట్టె ప్రయత్నం చేశారు. నాన్న గారి విషయంలో తప్పులు ఎన్ని జరిగినా.. అదంతా ఒక విధిరాత అని కామెంట్ చేశారు.
Recommended Video

అలా జరిగిపోయింది..
ఆ వివాదాల గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆ విషయాలన్నిటిని ఒక డెస్టిని అంటాను. జరగాల్సింది జరిగిపోయింది. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని తెలివిగా సమాధానం చెప్పారు. అదే విధంగా ఎన్టీఆర్ గొప్పతనం గురించి అందరికి తెలుసని ఆయన చేసిన సినిమాలు ప్రజాసేవ అందరికి తెలుసని బాలయ్య వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











