బాలకృష్ణ చేతులమీదుగా గరుడవేగ ట్రైలర్

పి.ఎస్.వి గరుడ వేగ 125.18 ట్రైలర్ ను రేపు రాత్రి 8 గంటలకు వదలనున్నారు. హైదరాబాద్ - జూబ్లీహిల్స్ లోని ఆర్కే సినీ ప్లెక్స్ లో "బాలకృష్ణ" చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.

Recommended Video

బాలకృష్ణ చేతులమీదుగా గరుడవేగ ట్రైలర్..

రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం పి.ఎస్.వి గరుడ వేగ 125.18. ఉగ్రవాదం అంటే అభం-శుభం తెలియని జనాల్ని చంపడమే కాదు. యువతను పెదతోవ పట్టించడం, పదిమందితో కలిసి ప్రజల్ని భయపెట్టడం, పరాయి దేశాల నుంచి మాదక ద్రవ్యాలను తీసుకొచ్చి మన దేశంలో విక్రయించడం, మన దేశ సంపదను అక్కడికి తరలించడం వంటి కార్యకలాపాలన్నీ ఉగ్రవాదంలో భాగమే.

పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం

పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం

అటువంటి ప్రమాదకర శక్తులని సమాజం నుంచి బహిష్కరించడమే 'ఎన్‌ఐఏ' (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ). ఇదే కథాంశంతో రాజశేఖర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.

నవంబర్ 3న విడుదల

నవంబర్ 3న విడుదల

భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాను నవంబర్ 3న విడుదల చేసేందుకు మూవీ యూనిట్ రెడీ అవుతుంది. ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుండగా... సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఎం.కోటేశ్వరరాజు నిర్మాతగా 25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది.

 ట్రైలర్ ను లాంచ్

ట్రైలర్ ను లాంచ్

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి రేపు రాత్రి 8 గంటలకు ట్రైలర్ ను వదలనున్నారు. హైదరాబాద్ - జూబ్లీహిల్స్ లోని ఆర్కే సినీ ప్లెక్స్ లో "బాలకృష్ణ" చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్

ఈ కారణంగా ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుందనే నమ్మకంతో వున్నారు. ఇప్పటికే వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ ట్రైలర్ తో అంచనాలు భారీగా పెరగడం ఖాయమని భావిస్తున్నారు. రాజశేఖర్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. పూజా కుమార్ కథానాయికగా నటించగా, శ్రద్ధా దాస్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ కానుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X