క్రాక్ దర్శకుడితో నందమూరి హీరో ఫిక్స్.. పట్టాలెక్కేది ఎప్పుడంటే?
ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కాంబినేషన్స్ అనగానే ఆడియెన్స్ లో అంచనాలు ఒక్కసారిగా భారీ స్థాయికి చేరుకుంటాయి. ఇక తెలుగులో డోస్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే బాలకృష్ణ లాంటి పవర్ఫుల్ హీరోతో కమర్షియల్ మాస్ దర్శకులు సినిమా చేస్తే ఆ కిక్కు మామూలుగా ఉండదు. ఇక రానున్న రోజుల్లో బాలకృష్ణ కూడా తన స్టైల్ కు తగ్గట్లుగా మాస్ దర్శకులతోనే సినిమాలు చేయాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల బాలయ్య ఒక మాస్ దర్శకుడిని ఫిక్స్ చేసినట్లు టాక్ వస్తోంది. బాలయ్య నటించిన గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎలాగైనా ఈ సారి బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బాక్సాఫీస్ హిట్ చాలానే కష్టపడుతున్నాడు. ఇక ఆ సినిమా తరువాత బాలకృష్ణ ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయంలో ఇంకా అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు. బి.గోపాల్, అనిల్ రావిపూడి వంటి దర్శకులు రెడీగా ఉన్నట్లు టాక్ వస్తున్నప్పటికి ఇంకా ఫైనల్ కాలేదు.

ఇక ఇటీవల గోపీచంద్ మలినేని అయితే బాలయ్యతో సినిమా ఉంటుందని చెప్పేశాడు. అయితే ఆ సినిమాను మే నెలలో స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. క్రాక్ సినిమాతో డైరెక్టర్ గోపిచంద్ మలినేనీ ఇటీవల బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అయితే అందుకున్నాడు. దీంతో బాలకృష్ణ పెద్దగా డౌట్ లేకుండా అతనితో సినిమా చేయడబికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్ పై మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











