Don't Miss!
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- News
సీజేఐ డీవై చంద్రచూడ్ కొత్త టీమ్..!!
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Veera Simha Reddy First Review: పవర్ ఫుల్ పంచ్ లు, ఏడిపించేలా బాలయ్య నటన.. క్లైమాక్స్ మాత్రం అలా!
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా గర్జించబోతున్న చిత్రం వీర సింహా రెడ్డి. టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఊర మాస్ యాక్షన్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. అనంతపురం బ్యాక్ డ్రాప్ లోనే దర్శకుడు కొన్ని నిజజీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను తీర్చిదిద్దినట్లు చెప్పాడు. బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా రివ్యూ అప్పుడే వచ్చేసింది. వీర సింహా రెడ్డి ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో చూద్దామా!

ఎక్కడికెల్లిన జై బాలయ్య నినాదం..
నట సార్వభౌమ, స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనదైన స్టైల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. నందమూరి నటసింహం బాలకృష్ణను అభిమానులు బాలయ్య బాబు అని ముద్గుగా పిలిచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక ఎక్కడికెళ్లిన.. విదేశాల్లో చూసిన బాలయ్య బాబు క్రేజ్ మాములుగా ఉండదు. జై బాలయ్య అనే నినాదంతో మారు మోగాల్సిందే.

భారీ అంచనాలతో..
ఇక బాలకృష్ణ నుంచి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఓ సినిమా వస్తుందంటే చాలు సినిమాపై అంచనాలే కాకుండా అభిమానుల్లో బీభత్సమైన క్యూరియాసిటీ నెలకొంటుంది. దానికి ఒక మాస్ డైరెక్టర్ తోడు అయితే ఇంకెలా ఉంటుంది. అలాంటి భారీ అంచనాలతో మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కిన చిత్రమే వీర సింహా రెడ్డి. అఖండ చిత్రంతో బాలకృష్ణ జోరు మీద ఉంటే.. క్రాక్ సినిమాతో గోపిచంద్ మలినేని మంచి ఊపు మీదున్నాడు.

అన్ని కలిసివచ్చే అంశాలే..
హిట్ ట్రాక్ లో ఉన్న గోపిచంద్-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ గా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందించాడు. బాలకృష్ణ-గోపిచంద్-తమన్-మైత్రీ మూవీ మేకర్స్ ఇలా ఎటు చూసిన వీర సింహా రెడ్డి సినిమాకు అన్ని కలిసొచ్చే అంశాలే. అంతకుమించి బాలయ్య సినిమాకు ఎప్పుడూ సెంటిమెంట్ గా వస్తున్న సింహా అనే పేరు కూడా టైటిల్ లో ఉండటంతో ఈ చిత్రం పక్కాగా విజయం సాధిస్తుందని అంతా నమ్మకంతో ఉన్నారు.

సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్..
ఇక బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాకు సంబంధించిన అన్ని రకాల పనులు కూడా పూర్తయ్యాయి. వీరసింహా రెడ్డి ఫైనల్ రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా 3 గంటలకు పైగా సినిమా రన్ టైమ్ అనుకోగా ఆ తర్వాత డైరెక్టర్ గోపించంద్ ఎడిటర్ తో చర్చించి ఫైనల్ రన్ టైమ్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

వీర సింహా రెడ్డి ఫస్ట్ రివ్యూ...
బాలయ్య బాబు మరోసారి ద్విపాత్రాభినయం చేసిన వీర సింహా రెడ్డి చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ/ఏ సర్టిఫికేట్ ను జారీ చేస్తూ పూర్తిగా బాలకృష్ణ మార్క్ సినిమాగ వచ్చిందని పేర్కొంది. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ అప్పుడే వచ్చేసింది. ప్రముఖ సెన్సార్ సభ్యుడు, సినీ విశ్లేషకుడు అయిన ఉమర్ సంధు.. వీర సింహా రెడ్డి చిత్రాన్ని వీక్షించి తర్వాత సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చాడు.

టెర్రిఫిక్ గా క్లైమాక్స్.. 3.5 స్టార్ రేటింగ్..
ఇంకా ఉమర్ సంధు షేర్ చేసిన పోస్టులో "వీర సింహా రెడ్డి సినిమా నాన్ స్టాప్ యాక్షన్ తో అలరిస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే కొత్తగా లేకపోయినప్పటికీ ఎంగేజింగ్ గా మంచి టైమ్ పాస్ అవుతుంది. టర్కీ లొకేషన్స్ అమెజింగ్ గా ఉన్నాయి. శ్రుతి హాసన్ కూడా ఎప్పటిలానే అదరగొట్టింది. చివరి 15 నిమిషాలు టెర్రిఫిక్ గా ఉంటాయి. మొత్తంగా వీర సింహా రెడ్డి పైసా వసూల్ మాస్ చిత్రం" అని పేర్కొన్న ఆయన సినిమాకు 5కి 3.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.
First Review #VeeraSimhaReddy ! #NandamuriBalakrishna is the biggest asset of the film. He has given a tremendous performance. #Balakrishna not only impresses the masses with his punch dialogues but also moves them to tears with his emotional avatar in some scenes.
— Umair Sandhu (@UmairSandu) January 9, 2023
3.5⭐️/5⭐️