Taraka Ratna పెద్దకర్మ.. ఆహ్వాన పత్రికపై వారిద్దరి పేర్లు.. ఆసక్తికరంగా చర్చ

సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న మరణానంతరం అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అప్పటివరకు సినిమాల్లో హీరోగా, విలన్ గా రాణించిన ఆయన రాజకీయపరంగా ఎదగాలనుకున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 23 రోజుల నిర్విరామంగా కొనసాగిన చికిత్స తర్వాత ఆయన మృత్యుఒడిలోకి వెళ్లారు. నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనపెద్ద కర్మకు సంబంధించిన ఓ విషయం హాట్ టాపిగ్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

అమరావతి సినిమాలో..

అమరావతి సినిమాలో..

ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి హీరో తారకరత్న తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత చేసిన సినిమాల్లో హీరోగా పెద్దగా రాణించలేకపోయినా ప్రతినాయకుడిగా మాత్రం అలరించారు తారకరత్న. రవిబాబు దర్శకత్వంలో భూమిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన అమరావతి సినిమాలో ఆయన విలనిజానికి ఉత్తమ విలన్ గా నంది అవార్డు కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే.

కుప్పంలోని పాదయాత్రలో..

కుప్పంలోని పాదయాత్రలో..

ఒకే ఏడాది ఏకంగా 9 సినిమాలకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్న నందమూరి తారకరత్న కొన్ని సినిమాలు తప్పా మిగతావి సెట్స్ పైకి వెళ్లలేదు. తారకరత్న ఎంతగా ప్రయత్నించినప్పటికీ సినిమాలు, వెబ్ సిరీస్ లు పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ప్రజా సేవకోసం కృషి చేద్దామన్న ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావించారు. ఇలా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో తన బావ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురయ్యారు.

ఫిబ్రవరి 20న..

ఫిబ్రవరి 20న..

గుండెలోపోటుకు గురైన తారకరత్నను మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి చేర్పించిన విషయం తెలిసిందే. విదేశీయి వైద్యుల సహకారం, ఇతర మెరుగైన సేవలతో చికిత్స పొందిన తారకరత్న శనివారం (ఫిబ్రవరి 18) కన్నుమూశారు. 23 రోజులుగా మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరి 20న నందమూరి తారకరత్న అంత్యక్రియలను నిర్వహించగా.. అశేష్ జనం హాజరైంది.

కలిసి అంతిమ సంస్కారాలు..

కలిసి అంతిమ సంస్కారాలు..


ప్రస్తుతం తారకరత్న పెద్దకర్మ హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పరిణామాల్లో నందమూరి బాలకృష్ణ, విజయ సాయి రెడ్డి కలవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి బంధువు కావడంతో.. అప్పటివరకు భిన్న దృవాలుగా ఉన్న విజయసాయి రెడ్డి, చంద్రబాబు కలిసి తారకరత్న ఫ్యామిలీకి అండగా ఉండేందుకు కలిశారు. వీరిద్దరూ కలిసే తారకరత్న అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

బాలయ్యకు కృతజ్ఞతలు..

బాలయ్యకు కృతజ్ఞతలు..


తారకరత్న కుటుంబానికి సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చిన ఈ ఇద్దరి రాజకీయ నాయకులపై కొద్దిపాటి విమర్శలు వచ్చిన ఎక్కువ మంది మాత్రం హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బాలయ్య, విజయసాయి రెడ్డి కులుసుకుంటారని టాక్ వినిపిస్తోంది. తారకరత్న అస్వస్థకు గురైనప్పటి నుంచి ఆయన బాగోగులు చూసుకున్న బాలకృష్ణపై ఇదివరకే ఎంపీ విజయసాయి రెడ్డి ఎంతగానో అభినందించారు. అంతేకాకుండా కృతజ్ఞతలు కూడా తెలిపారట.

గుసగుసలాడుతున్న వార్తలు..

గుసగుసలాడుతున్న వార్తలు..

తాజాగా ఫిల్మ్ నగర్ క్లబ్ లో మార్చి 2న జరిగనున్న తారకరత్న పెద్దకర్మకు రావాలంటూ ఆహ్వాన పత్రిక ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఆహ్వానించేవారి పేర్లలో మొదటగా నందమూరి బాలకృష్ణతోపాటు వేణుంబాక విజయసాయి రెడ్డి అని ఉండటంపై రాజకీయంగా ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది. ఇలా వీళ్లిద్దరు ఈ బాధ్యతలు తీసుకోవడంతో త్వరలో కలుస్తారన్న వార్తలు గుసగుసలాడుతున్నాయి. ఇది ఫ్యామిలీ మ్యాటర్ గానే తప్పా రాజకీయంగా చూడొద్దని పలువురు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X