బోయపాటికి బాలకృష్ణ పరామర్శ.. డైరెక్టర్ ఇంటికెళ్లి మరీ ఓదార్చిన నటసింహం

టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయన ఇంటికెళ్లి మరీ పరామర్శించారు. గత శుకృవారం బోయపాటి తల్లి సీతారావమ్మ (80) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

అయితే ఈ రోజు (బుధవారం) ఉదయం నేరుగా బోయపాటి స్వగ్రామం (గుంటూరు జిల్లా పెదకాకాని) వెళ్లి.. ఆయన తల్లి సీతారావమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు బాలకృష్ణ. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బాలయ్య విజయవాడలో ఉన్న ఆయన నేరుగా గుంటూరు వెళ్లి బోయపాటిని పరామర్శించారు. ఈ మేరకు కాసేపు ఆయనతో ముచ్చటించి ఓదార్చారు.

 Balakrishna Visits Boyapati Srinu Home After His Mother Death

ఇటీవలే రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డీలాపడిన బాలయ్య బాబు తన తదుపరి సినిమాను బోయపాటి దర్శకత్వంలోనే చేయనున్నారు. బాలయ్య 106వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్స్ చేస్తున్నారు బోయపాటి. . మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిననున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నాడు. బాలయ్య సరసన హీరోయిన్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య- బోయపాటి సక్సెస్‌ఫుల్ కాంబో కాబట్టి ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X