తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలయ్య
సినీ హీరో బాలకృష్ణ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీరామరాజ్యం సినిమా విడుదల నేపథ్యంలో ఆయన ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇందులో భాగంగా ఆయన శనివారం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థన చేశారు. విఐపి ప్రారంభ దర్శనంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన శుక్రవారం సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు.
బాలకృష్ణ శుక్రవారం శ్రీకాళహస్తిలో ముక్కంటికి పూజలు చేసిన విషయం తెలిసిందే. బాలయ్య హైదరబాదు నుండి ఉదయం శ్రీకాళహస్తి చేరుకోగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు త్రినేత్ర అతిథి గృహం వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి బాలయ్య ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో బాలయ్య రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆయనను ఆశీర్వదించి స్వామి వారి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందించారు.అనంతరం బాలయ్య బుచ్చినాయుడు కండ్రిగలోని ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లారు.


Click it and Unblock the Notifications











