అబ్బాయి ఎన్టీఆర్..'శక్తి' కోసం బాబయ్య బాలకృష్ణ

By Srikanya

ఎన్టీఆర్ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న'శక్తి' చిత్రానికి బాబాయ్ బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సమాచారం. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇక బాలకృష్ణ చెప్పబోయే ఈ వాయిస్ ఓవర్ ఈ చిత్రానికి హైలెట్ అయి నిలుస్తుందంటున్నారు. అలాగే ఈ చిత్రం అనంతరం దర్శకుడు మెహర్ రమేష్..బాలయ్యను డైరక్ట్ చేయనున్నారు శక్తి చిత్రం ప్రస్తుతం కులుమనాలీ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఆగస్టు 5 వరకూ ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. అలాగే బాలీవుడ్ నటి పూజా బేడీ ఈ చిత్రంలో ఈజిప్టు వనితగా కీలకపాత్ర పోషిస్తోంది.

అలాగే జాకీష్రాఫ్, సూద్ విలన్స్ గా కనిపించనున్నారు. ఓ అడ్వంచరస్ ఫాంటసీగా రూపొందే ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొత్త గెటప్ లో కనిపించి ఫైట్స్ వంటివి విభిన్నంగా చేయనున్నాడని చెప్తున్నారు. వైజయింతి మూవీస్ పతాకంపై ఇదే కాంబినేషన్ లో ఇంతకుముందు కంత్రి చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు అందిస్తూంటే, సమీర్ రెడ్డి కెమెరా, ఆనందసాయి..కళ, ఎడిటింగ్..మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X