Balakrishna vs Ntr: ఎన్టీఆర్‌ను ఘోరంగా బాలయ్య ఫ్యాన్స్ ట్రోల్స్..రాంచరణ్‌ను వివాదంలోకి లాగుతూ

నందమూరి అభిమానులు రెండుగా చీలిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. నందమూరి అభిమానులలో ఒక వర్గం బాలకృష్ణకు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు జునియర్ ఎన్టీఆర్‌కు అండగా నిలుస్తున్నారు. అసలు నందమూరి అభిమానులు ఇలా రెండు వర్గాలుగా విడిపోవడానికి నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకులకు జునియర్ ఎన్టీఆర్‌ రాకపోవడమే కారణంగా తెలుస్తోంది. దీంతో ఇక వర్గం జునియర్ ఎన్టీఆర్‌‌ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. వీరికి జునియర్ ఎన్టీఆర్‌ అభిమానులు కూడా కౌంటరిస్తున్నారు. ఆ వివారాల్లోకి వెళ్తే..

టీడీపీకి ప్రచారం .. ఆ తరువాత దూరం: 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన తాత స్థాపించిన టీడీపీ పార్టీ కోసం ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన తీరు.. పార్టీ నాయకులతో పాటు,సామాన్య ప్రజలను సైతం ఆకట్టుకుంది. ఆ సమయంలోనే టీడీపీకి భవిష్యత్తు నాయకుడు ఎన్టీఆరే అని మాటలు వినిపించాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం జరిగింది. ఎన్టీఆర్ భవిష్యత్తులో ఎక్కడ తమకు పోటీగా వస్తారో అని టీడీపీ అధినాయకత్వం ఆయన్ను దూరం పెట్టింది. అప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ టీడీపీతో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు.

Balakrishna vs Ntr:

'దమ్ము' సినిమా బంద్: ఇక 2012లో ఎన్టీఆర్ - బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన 'దమ్ము' సినిమా విడుదల సమయంలో టీడీపీ మరో అడుగు ముందుకేసిందనే చెప్పాలి. సినిమా విడుదల రోజున కృష్ణాజిల్లా బంద్‌కు పిలిపినిచ్చి. ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి క కారుకులైయ్యారు. అప్పటి నుంచే టీడీపీ సానుభూతిపరులు, బాలయ్య అభిమానులు ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసుకోవడం మొదలుపెట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తరువాత ఎన్టీఆర్ తమవాడు కాదు అనే ముద్ర వేయాలని కూడా చూశారని ఆయన అభిమానులు చెబుతుంటారు.

బాలయ్య-ఎన్టీఆర్‌ల మధ్య ముదిరిన వివాదం: కారణాలు తెలియవు కాని బాలయ్య మొదటి నుంచి కూడా జునియర్ ఎన్టీఆర్‌ను దూరం పెడుతూనే వచ్చారు. పలు వేదికల మీద పలకరించుకోవడం తప్పితే ... వీరి మధ్య అంత సఖ్యత లేదని ఇట్టే అర్థం అవుతుంది. ఆ మధ్య తారకరత్నకి శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చిన జునియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను పలకరించడానికి బాలకృష్ణ ఇష్టపడలేదు. జునియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌ ఇద్దరు కూడా బాలకృష్ణ వస్తున్నారని.. లేచి నిల్చున్నారు.. కాని వారిని చూసి చూడనట్టుగానే ఆయన వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సొషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

Balakrishna vs Ntr:

తాత శత జయంతి వేడుకలకు దూరం: వెండితెర దైవంగా భావించే నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకులకు రావాలని నిర్వహకులు, జునియర్ ఎన్టీఆర్‌కు ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే అప్పటికే ఫ్యామిలీతో టూర్ ఫిక్స్ చేసుకోవడంతో రాలేనని నిర్వహకులకు ఓ లేఖ కూడా జునియర్ ఎన్టీఆర్‌ రాయడం జరిగింది. ఎన్టీఆర్ వెళ్లకపోవడంతో కల్యాణ్ రామ్ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తాత శతజయంతి వేడుకులకు రాకపోవడంతో.. జునియర్ ఎన్టీఆర్ పొలిటికల్‌గా కొందరికి టార్గెట్ అయ్యారు. ఎన్టీఆర్‌ని దెబ్బతీయాలని ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది ఆయుధంలా దొరికినట్లు అయింది. సోషల్ మీడియా వేదికగా జునియర్ ఎన్టీఆర్‌‌పై విమర్శలు చేస్తున్నారు.

Balakrishna vs Ntr:

రామ్ చరణ్, నాగచైతన్యలను చూసి నేర్చుకో..:
తాత పేరు పెట్టుకొని ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్‌కి ఆయనతో అవసరం తీరిపోయింది. జీవితం ఇచ్చిన తాతయ్య కోసం ఒక పూట కేటాయించలేక పోయాడని కౌంటర్లు మొదలుపెట్టారు. రామ్ చరణ్, నాగచైతన్య వంటి హీరోలను చూసి అయిన ఎన్టీఆర్ సిగ్గు తెచ్చుకోవాలని ఎన్టీఆర్‌కు బాలయ్య అభిమానులు చురకలు అంటిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు సైతం అదే రీతిలో వారికి బుద్ది చెబుతున్నారు. తమ హీరో మీద ఎవరైనా కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరిస్తున్నారు. టీడీపీ అయినా బాలయ్య అయినా మా ఎన్టీఆర్ జోలికి రానంత వరకే... ఒకవేళ వస్తే మాకు ఎవరైనా ఒకటే అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.మరి ఈ నందమూరి అభిమానుల మధ్య వార్ ఎప్పుడు ముగింపు పలుకుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X