Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
బాలకృష్ణ - రవితేజ మరో సారి ‘ఢీ’ అంటే ‘ఢీ’!
ఇక్కడ మేము అనే 'వర్సెస్" అనే మాట వారిద్దరి పర్సనల్ లైఫ్ కు సంబంధించినది కాదులెండి. సినీలైఫ్ కు సంబంధించినది. 'విక్రమార్కుడు" చిత్రం టైమ్ లో వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయన్న వార్తలు మొన్నటి వరదలు ఎంతటి ఉదృతంగా వచ్చాయో అదే స్థాయిలో వచ్చాయి. కానీ రవితేజ వాటిలో నిజం లేదని ఖండించినప్పటికీ 'నిప్పు లేనిదే పొగరాదు" అన్నట్టు మనవాళ్ళు ఏదో వుండనే వుంది అనుకుంటూనే వారి చిత్రాలపై ఓ కన్ను వేస్తూనే వున్నారు. 'విక్రమార్కుడు" చిత్రం తర్వాత నుండి వీరిద్దరి సినిమాలు ఒకే టైమ్ లో వచ్చిన సినిమాలను గమనించడం మొదలెట్టారు. గత సంవత్సరం సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య 'ఒక్క మగాడు", మోస్తరు అంచనాలతో 'కృష్ణ" విడుదలయ్యాయి. విశేషంగా గణాంకాలు మారి 'కృష్ణ" విజంభించి 'ఒక్క మగాడు స్పృహ లేకుండా కోమాలోకి పంపాడు. అనంతరం ఈ ఏడాదే వారం వ్యవధిలో 'మిత్రుడు", 'కిక్" చిత్రాలు విడుదలయ్యాయి. వీటిల్లో కూడా రవితేజదే పై చేయ్యి. కాగ వీరిద్దరూ మరోసారి సమరమే...అంటూ ఈ సంక్రాతికి పోటి పడనున్నారు 'సింహా", 'శంబో శివ శంభో" చిత్రాలతో. గొడవల్లో పై చెయ్యి బాలకృష్ణదే అయినప్పటికీ పోటిగా రిలీజ్ అయ్యే సినిమాలతో పై చెయ్యి అంటున్న రవితేజ ఈ సారి కూడా విజయం సాధిస్తాడంటారా?