అందుకు ఎవరైతే బాగుంటారు...బాలకృష్ణ..? వెంకటేష్..?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడుగా మురళీమోహన్ పదవికాలం సెప్టెంబర్ కి పూర్తవుతుంది. దీంతో 'మీ" నూతన అధ్యక్షడు ఎవరనేది సినీవర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సారి యువరత్న బాలకృష్ణని మా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టమని సినీ ప్రముఖులందరూ అడిగారంట. అయితే ప్రస్తుతం సినిమాలతో బిజీ, బిజీగా వున్నాను, అందుచేత మా అధ్యక్ష పదవికి చేయలేనని, బాధ్యతలు చేపట్టటానికి బాలయ్య లేడంట.
అయితే సినీ పెద్దలంతా కలిసి ఎలాగైనా సరే ఈసారి బాలయ్య అధ్యక్ష పదవి చేపట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారట. ఒక వేళ బాలయ్య అంగీకరించకపోతే నెక్ట్స్ వెంకటేష్ మా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేలా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అయితే వెంకటేష్..బాలయ్య..వీళ్ళిద్దరిలో ఎవరు 'మా" అధ్యక్ష పదవి చేపడతారనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
బాలకృష్ణ వెంకటేష్ మురళీ మోహన్ పరమవీర చక్ర దాసరి నారాయణ రావు balakrishna venkatesh murali mohan parama veera chakra dasari narayana rao


Click it and Unblock the Notifications