సింహాను తలదన్నే చిత్రంగా పరమవీరచక్ర: బాలయ్య
సింహా హిట్ తర్వాత టైటిల్ తోనే అంతకు మించిన ఎక్స్ పెక్టేషన్స్ తో బాలకృష్ణ హీరోగా సి కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో షూటింగ్ జరుపుకుంటోన్న దాసరి నారాణయణ రావు 150వ చిత్రం పరమవీరచక్ర. అమీషా పటేల్, షీలా, నేహాదూపియా హీరోయిన్స్ గా నటిస్తున్నఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిల్మిం సిటీలో జరుగుతోంది. కొన్ని ఫైట్ సీన్ లను రామ్ లక్ష్మన్ లు కంపోజ్ చేశారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాల రూపకల్పన చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ రిస్కీ షాట్లలో తాను డూప్ లేకుండా నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సింహాను మించిన చిత్రంగా ఉండాలంటే పరమవీరచక్రలో తాను మరింత కష్టపడాల్సిన అవసరం ఉన్నదని దాసరితో చెప్పినట్లు భోగట్టా.
బాలకృష్ణ ప్రత్యేకంగా ఈ విషయాన్ని మరీ నొక్కి నొక్కి చెప్పడంతో దాసరి కూడా అటువంటి సన్నివేశాలు వచ్చినపుడు డూప్ లేకుండా బాలయ్యతోనే నటింపజేసేందుకు అంగీకరించినట్లు తెలిసింది. మొత్తమ్మీద సింహాను తలదన్నే చిత్రంగా పరమవీరచక్రను చూడాలని బాలకృష్ణ బలంగా కోరుకుంటున్నాడు. మరి దాసరి ఏం చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











