నాగార్జున కాంబినేషన్ పై బాలకృష్ణ
నాగార్జున తో కలిసి తాను నటించటానికి సిద్దమే అంటూ బాలకృష్ణ ప్రకటించారు.అయితే పౌరాణిక చిత్రాల్లో మాత్రమే అని తేల్చి చెప్పారు.ఆయన తాజా చిత్రం శ్రీరామరాజ్యం అందరి ప్రశంసలూ పొందతూ ముందుకు వెళ్ళుతున్న సందర్భాన్న ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు.ఆయన మాటల్లోనే...''పౌరాణిక చిత్రాల్లో రావణాసురుడు లాంటి ప్రతినాయక పాత్రలు పోషించేందుకూ నేను సిద్ధమే. ఈ తరహా చిత్రాల్లో నాగార్జునతో కలిసి నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. మల్టీస్టారర్ చిత్రాలకీ సిద్ధమే'' అన్నారు.ఇక శ్రీరామ రాజ్యం గురించి చెపుతూ..''శ్రీరామరాజ్యం చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోంది. దర్శకులు బాపు చిత్రాన్ని అద్భుతంగా మలచార''ని ఆనందం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఆయన మంచు మనోజ్ హీరోగా రూపొందుతోన్న ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు.ఆ షూటింగ్ నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ఉన్నారు.అక్కడ ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం షూటింగ్ లో పాల్గొంటన్నారు.ఈ చిత్రంలో బాలకృష్ణ ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు.ఆయన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.ఆయన సీన్స్ కోసం హైదరాబాద్‌లో ఆరున్నర కోట్ల రూపాయల వ్యయంతో భారీ సెట్‌ని తీర్చిదిద్దారు.ఏప్రిల్ నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.అలాగే బాలకృష్ణ మరో చిత్రం అధినాయకుడు కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అవుతోంది.


Click it and Unblock the Notifications











