మోక్షజ్ఞ ని హీరోగా చేయాలని ఉంది అయితే...బాలకృష్ణ
తనను హీరోగా చేయాలని అబిమానులంతా కోరుకుంటున్నారు. నాక్కూడా అలాగే ఉంది. అయితే అందుకు నాలుగైదేళ్ళు సమయం ఉంది.మా వాడికిప్పుడు పదిహేనేళ్ళు. పదో తరగతి పూర్తి చేసి ఇప్పుడు ఇంటర్ లోకి వెళ్థున్నాడు అంటూ బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞని ఎప్పుడు హీరోగా పరిచయం చేయబోతున్నారనే విషయం స్పష్టంగా మీడియాకు తెలియచేసారు. అలాగే ఆయన మాటల్లోనే...మోక్షజ్ఞకు కూడా నటన మీద పూర్తి ఆసక్తి ఉన్నట్లే కనపడుతోంది. అయితే వాడు ముందు చదువు పూర్తి చేయాలి. అప్పుడప్పుడు నాన్నగారి సినిమాలు చూపిస్తూ వాడికి ప్రపంచం గురించి చెబుతున్నాను. నా గురించి కన్నా వాళ్ళ తాత గారి గురించే ఎక్కువ చెబుతూంటాను. మా ఆకాంక్షలు వాడు నిజం చేస్తే నాకన్నా గర్వపడే, ఆనందపడే వ్యక్తి ఇంకెవ్వరూ ఉండరు అన్నారు బాలకృష్ణ.
బాలకృష్ణ సింహా మోక్షజ్ఞ బోయపాటి శ్రీను పరమ వీర చక్ర balakrishna puri jagannath mokshagna dasari meher ramesh


Click it and Unblock the Notifications