twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ చూసి మెచ్చుకున్నాడు(ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్: మంచి సినిమా అనిపిస్తే చూసి మెచ్చుకోవటం నందమూరి బాలకృష్ణ నైజం. ప్రసాద్ లాబ్స్ లో 'ఊహలు గుసగుసలాడే' సినిమాని ఆయన చూసారు. చూసిన తర్వాత ఆయన ఇలాంటి మంచి సినిమాని అందించినందుకు ఈ చిత్ర టీంని ప్రశంశించారు.

    బాలకృష్ణ మాట్లాడుతూ "ఊహలు గుసగుసలాడే' యువత కి, కుటుంబ ప్రేక్షకులు కలిసి చూడదగిన సినిమా. ముఖ్యంగా సినిమాలో జీరో వల్గారిటీ ఉండేలా ఈ సినిమాని తీసినందుకు సాయి కొర్రపాటికి అభినందనలు'అన్నారు.

    బాలకృష్ణ ఈ సినిమా చూసి ఈ చిత్ర టీం అందరినీ అభినందించడంతో ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే సాయి కొర్రపాటి బాలకృష్ణ గారు బిజీగా ఉండి కూడా సమయం కేటాయించి ఈ సినిమా చూసినందుకు ఆయనకీ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగ శౌర్య, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.

    స్లైడ్ షోలో...ఫొటోలు

    దర్శకుడుగా లాంచ్

    దర్శకుడుగా లాంచ్

    ‘అష్టాచమ్మా' హీరో శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా మారాడు. వారాహి చలనచిత్రం, సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్ పతాకంపై ‘ఊహలు గుసగుసలాడే' చిత్రాన్ని రూపొందించారు.

    కొత్తవాళ్ళతో...

    కొత్తవాళ్ళతో...

    రజనీ కొర్రపాటి రూపొందించిన ఈ చిత్రంలో శౌర్య, రాశిఖన్నా జంటగా నటించారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల చేసారు.

    శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ....

    శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ....

    "ఈ కథను 15 నిమిషాల్లో సాయిగారికి చెప్పాను. నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. నేను కూడా ఓ పాత్రను చేద్దామనుకుని తర్వాత వద్దనుకున్నాను. కానీ సాయిగారు చేయమనడంతో చేసేశాను. 'అష్టాచమ్మా' చేసినప్పటి నుంచి నాకు కల్యాణిగారు బాగా తెలుసు. మంచి సంగీతాన్నిచ్చారు. శౌర్య, రాశి చాలా బాగా నటించారు. సినిమా బాగా వచ్చింది'' అని అన్నారు.

    తెర ముందు

    తెర ముందు

    రావూ రమేష్, సూర్య, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, సి.వి.ఎల్.నరసింహారావు, ప్రగతి, హేమ, సత్యకృష్ణ, విద్యారావు, వెంకట్ ఐమాక్స్, హరీశ్, సతీష్ తదితరులు నటించారు.

    తెర వెనుక...

    తెర వెనుక...

    ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల, అనంత్ శ్రీరామ్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: కల్యాణి కోడూరి, నిర్మాత: రజని కొర్రపాటి, రచన, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల.

    English summary
    Hindupur MLA and film Hero Balakrishna watched Oohalu Gusagusalade
 film on 22nd June, Balakrishna praised the film unit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X