బాలకృష్ణ తీరు మారిందట. ఇతరులు నటించిన సినిమాలు ఆయన ఏ మాత్రం చూడరు. తన సినిమాలనే ఆయన మాటిమాటికీ చూస్తుంటాడని వినికిడి. అయితే ఆయన తన మనసు మార్చుకున్నారని చెబుతున్నారు. ఆయన ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమా చూశారట. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ను వైఫల్యాలు వెంటాడుతన్నాయి. దీన్ని తట్టుకుని విజయాలను అందుకోవాలంటే ఏం చేయాలనే అంతర్మధనం టాలీవుడ్ లో జరుగుతూనే ఉంది. కథ బాగుందా, లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా దర్శకుడిపై, నిర్మాతపై నమ్మకం ఉంచి సినిమాలకు ఒప్పేసుకోవడం బాలకృష్ణకు కూడా అలవాటేనట. ఇటీవల ఒక్క మగాడు విషయంలో అదే జరిగింది. అయితే సరైంది కాదనుకున్నారో ఏమో కొత్తవారితో శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ చూసి గెలుపు ఫార్ములాను బాలకృష్ణ అధ్యయనం చేశారని అంటున్నారు.