‘ఆగడు’ సినిమా చూసిన బాలయ్య
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ సినిమాలు చూడటం చాలా తక్కువ. అందులోనూ ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటూ, మరో వైపు సినిమాలు చేస్తుండటం వల్ల ఉండటం వల్ల ఆయన థియేటర్‌కు వెళ్లి సినిమా చూసేంత సమయం ఉండనే ఉండదు. అయినా సరే ప్రత్యేకంగా సమయం కేటాయించి మహేష్ బాబు నటించిన ‘ఆగడు' చిత్రం వీక్షించారు బాలయ్య.
బాలకృష్ణతో ‘లెజెండ్' చిత్రం తెరకెక్కించిన 14 రీల్స్ వారే ‘ఆగడు' నిర్మించిన సంగతి తెలిసిందే. నిర్మాతల కోరిక మేర బాలయ్య ‘ఆగడు' సినిమా చూసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ కోసం నిర్మాతలు స్పెషల్ షో వేసినట్లు సమాచారం.
బాలయ్య ‘లెంజడ్' సినిమా విషయానికొస్తే...ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా 175 డేస్ మార్కును అందుకుంది. ఎమ్మిగనూరులోని మిని శివ థియేటర్లో డైరెక్ట్ 4 ఆటలతో 175 రోజులు పూర్తి చేసుకుంది. మార్చి 28న రిలీజ్ అయిన బాలయ్య చిత్రం సరిగ్గా జులై 5న 100 రోజుల పూర్తి చేసుకుని 175 డేస్ దిశగా పరుగులు పెట్టింది.

బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి దర్శకత్వ ప్రతిభ, జగపతి బాబు విలనిజం వెరసి లెజెండ్‌ని లెజెండరీ హిట్ గా నిలిపాయి. దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా బాలయ్య చిత్రానికి సంగీతం అందించిన ఈ లెజెండ్ మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా రీ రికార్డింగ్ ని కూడా అద్భుతంగా ఇచ్చాడు దేవి. లెజెండ్ విజయంపై బాలయ్య అభిమానులు హ్యాపీగా ఉన్నారు.
భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు గోపీచంద్ ఆచంట రామ్ ఆచంట,అనిల్ సుంకర. శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ష్ రైట్స్ కలుపుకుని ఈ చిత్రం నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ నటించారు. 'లెజెండ్' చిత్రం 31 సెంటర్లలో 100 రోజుల వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే.
లెజెండ్' నిర్మాతలు గోపీచంద్ ఆచంట రామ్ ఆచంట,అనిల్ సుంకర 14రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో తెరకెక్కించిన ‘ఆగడు' చిత్రం సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా విడుదయింది.


Click it and Unblock the Notifications











