బాలయ్య అభిమానులను కొట్టడంపై.. భార్య వసుంధర దేవి రియాక్షన్ ఇదీ!
నందమూరి నటసింహం బాలకృష్ణ.. సినిమాల్లో పవర్ ఫుల్‌గా, అగ్రెసివ్‌గా కనిపిస్తారు. తెరపై ఆయన చేసే విన్యాసాలు చూసి అభిమానులు క్లాప్స్, విజిల్స్ వేస్తూ తన్మయత్వం పొందుతుంటారు. అయితే బాలయ్య సినిమాల్లో మాదిరిగానే రియల్ లైఫ్‌లో ప్రవర్తిస్తే... ఏకంగా తనను అభిమానించే ఫ్యాన్స్ మీదే దాడి చేస్తే కూడా వారు అలాగే ఫీలవుతారా?... అంటే అవును అనే విధంగా సమాధానం ఇస్తున్నారు ఆయన సతీమణి వసుంధర దేవి. హిందూపురం నుంచి పోటీ చేస్తున్న తన భర్తకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్న వసుంధర దేవిని తాజాగా ఓ టీవీ ఛానల్ వారు కదిలించారు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలయ్య ఎటాక్ వీడియోలపై ఆమె స్పందించారు.

అభిమానులతో ఉన్న చనువు వల్లే
బాలకృష్ణ దూకుడు స్వభావం చాలా వివాదాస్పదం అవుతోంది. ఆయనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆయనకు కోపం వస్తే అంతేనా? ఒక భార్యగా మీరు ఈ వివాదంపై ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు వసుంధర దేవి స్పందించారు. ‘అభిమానులతో ఉన్న చనువు వల్లే మనవాళ్లు అనుకుని ఆయన అలా ప్రవర్తిస్తారు' అని తెలిపారు.

అభిమానులు కూడా ఏమీ అనుకోరు...
‘‘అభిమానులు కూడా బాలకృష్ణ గారు ప్రవర్తన గురించి ఏమీ అనుకోరు. ఇలా చేయడంపై వాళ్లు కూడా సంతోషంగానే ఉంటారు.' అంటూ వసుంధర దేవి వ్యాఖ్యానించారు. అయితే గిట్టని వాళ్లు ఆయన ప్రవర్తనను మరో రకంగా హైలెట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తుంటారు'' అని వసుంధర దేవి చెప్పుకొచ్చారు.

పేద ప్రజలు కష్టాల్లో ఉంటే బాలకృష్ణ తట్టుకోలేరు
‘‘పేద ప్రజలు కష్టాల్లో ఉంటే బాలకృష్ణ గారు తట్టుకోలేరు. అందుకు ఉదాహరణ బసవతారకం ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి హిందూపురం నుంచి కానీ, ఫ్యాన్స్ కానీ, పేదవారు ఎవరు వచ్చినా ఎవరికీ ట్రిట్మెంట్ నిరాకరించరు.'' అని వసుంధర దేవి చెప్పుకొచక్చారు.

ఆయనే స్వయంగా వెళ్లి నిధులు సేకరిస్తున్నారు
‘‘బసవతారకం ఆసుపత్రికి వచ్చే వారి వద్ద డబ్బు ఉన్నా, లేక పోయినా... వైద్యం చేస్తారు. సీఎం రీలీఫ్ ఫండ్ నుంచి వారి వైద్యానికి సహాయం అందేలా చేస్తారు. విదేశాలకు వెళ్లి నిధులు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో సింగిల్ పేషెంట్‌కు కూడా వైద్యం నిరాకరించబడలేదు.'' అని వసుంధర దేవి తెలిపారు.


Click it and Unblock the Notifications











