అదీ బాలయ్య అంటే!.. అడగ్గానే ఆలోచించకుండా అలా చేయడానికి రెడీ!
నటసింహం నందమూరి బాలకృష్ణ... ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే జగపతిబాబు కోరిక మేరకు ఆయన ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. జగపతిబాబు కీలకపాత్రలో నటించిన రుద్రంగి అనే సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ ముఖ్యఅతిథిగా రానున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. కుటుంబంలో తండ్రి వారసత్వాన్ని అందుకుని స్టార్ హీరోగా అనేక సినిమాలతో హిట్లు కొట్టడమే కాదు... నందమూరి వంశానికంటూ.. అభిమానులను సంపాదించుకున్నాడు. గత కొంతకాలంగా ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఆయన అన్ స్టాపబుల్ షో చేసిన తర్వాత ఆయన ఇమేజ్ ఒకసారిగా మారిపోయింది.

ఇంతకు ముందు వరకు నందమూరి బాలకృష్ణ అంటే కోపిష్టి అని అందరి మీద కోప్పడతాడు అనే ముద్ర ఉండేది. కానీ ఈ అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే అనే కార్యక్రమంతో ఆయన ఒక్కసారిగా ఓపెన్ అయిపోయి భోళా శంకరుడిలాగా తాను కూడా చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వాడినే అని ప్రూవ్ చేసుకున్నాడు. మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండవ సీజన్ కూడా చేశారు. అది కూడా సూపర్ హిట్ గా నిల్చింది. ఇక తర్వాత వచ్చిన అఖండ సినిమాతో పాటు వీరసింహారెడ్డి సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హీట్ లుగా నిలిచాయి.
ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.సైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఒక కీలకపాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే జగపతిబాబు కీలకపాత్రలో నటించిన రుద్రంగి అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ హాజరు కాబోతున్నారు.
తెలంగాణ పిరియాడిక్ ఫిలిమ్ గా తెరకెక్కిన రుద్రంగి సినిమా జులై ఏడవ తేదీన రిలీజ్ కాబోతుంది. జూన్ 29వ తేదీన అంటే రేపు హైదరాబాదులోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రధాన కన్వెన్షన్స్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా నందమూరి బాలకృష్ణ హాజరు కాబోతున్నారు. ఇదే విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గతంలో బాలకృష్ణ జగపతిబాబు లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి పనిచేశారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య సానిహిత్యం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరుకమ్మని కొడితే వెంటనే ఆయన ఒప్పుకుని సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బాలయ్య అభిమానులు తమ అభిమాన హీరోని మరోసారి చూసుకోవచ్చని ఆనందపడుతున్నారు.


Click it and Unblock the Notifications











