చిరు ముగ్గురు మొనగాళ్లు ఇరగదీసుండు...మరి బాలకృష్ణ...!?
నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని వేరేది పనిచేసిందో నీకు నెక్ట్స్ బర్త్ డే ఉండదు' అంటూ నందమూరి బాలకృష్ణ చేసిన సింహగర్జన ఇంకా వినిపిస్తూనే ఉంది. 'సింహా' విజయానందంలో ఉన్న బాలయ్య రెట్టింపు ఉత్సాహంతో సినిమాలను అంగీకరిస్తున్నారు.
ఒకసారి ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లి 15ఏళ్ల క్రితం చిరంజీవి నటించిన 'ముగ్గురు మొనగాళ్లు" సినిమాని గుర్తు చేసుకుందాం. ఈ చిత్రం 12 సెంటర్లలో 100రోజులు ఆడి రికార్డ్ సృష్టించింది. తాజాగా పరుచూరి మురళి దర్శకత్వంలో బాలకృష్ణ తాత, కొడుకు, మనవడిగా మూడు పాత్రలు చేస్తున్నాడట. ఈ చిత్రాన్ని శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.కుమార్‌చౌదరి నిర్మించబోతున్నారు. 'ముగ్గురు మొనగాళ్లు" తర్వాత హీరో మూడు పాత్రలు చేసిన ఏ సినిమా కూడా 12 సెంటర్లలో 100రోజులు ఆడిన దాఖలాలు లేవు. మరి..బాలయ్య ఈ 'ముగ్గురు మొనగాళ్లు" రికార్డ్ ను బద్దలు కొడతాడా?లేదో ?వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











