నందమూరి బాలయ్యకి అంత సీన్ ఉందా???
బాక్సాఫీస్నే షేక్ చేసి బాక్సఫీస్ బొనాంజాగా పేరొందిన ఘనత బాలకృష్ణది. ఇప్పుడైతే సరైన విజయాలు లేవు గానీ ఒకప్పుడు ఇంకా చెప్పాలంటే 'లక్ష్మీ నరసింహా" వరకు ఆయన ఖాతాలో మంచి విజయాలే ఉన్నాయి. 1986లో తన సినిమాలు 7 విడుదలైతే వాటిలో ఆరు చిత్రాలు మంచి విజయం సాధించినవే. అలాంటి కెపాసిటీని సొంతం చేసుకున్న బాలయ్య ఇప్పుడు విజయాల రేసులో బాగానే వెనుకబడ్డాడు. హిట్ లతో పాటు సంవత్సరానికి ఆయన నుండి రావలసిన చిత్రాల సంఖ్య కూడా తక్కువగానే ఉంది.
దాదాపు 30ఏళ్ళుగా నటిస్తున్న బాలయ్య ఇప్పటి వరకు నటించిన చిత్రాల సంఖ్య జస్ట్ 90. తనతో పాటు వచ్చిన చిరు మాత్రం దాదాపు 150సినిమాలు చేశాడు. అలాగే తన తర్వాత వచ్చిన శ్రీకాంత్ కూడా చిన్నా, చితకా పాత్రలతో కలుపుకుని సెంచరీ చేసేశాడు. కానీ బాలయ్య తన స్పీడ్ వైఖరికి భిన్నంగా చిత్రాల సంఖ్య తగ్గించుకుని సంవత్సరానికి ఒక చిత్రం అనే నేటి తరపు హీరోల శైలికి తగ్గట్టుగా ఉన్నాడు.
ఈ లెక్కల ప్రకారం బాలయ్య సెంచరీ చేయడానికి పది సంవత్సరాలు పట్టచ్చు. ఆ లెక్కన సెంచరీ ఫిగర్ ని బాలయ్య క్యాచ్ చేయడం ఇప్పట్లో కుదిరే యవ్వారంలా లేదు. 'ఆదిత్య 369" సినిమాలోలాగా 'సెంచరీలు కొట్టే వయస్సు మాది" అని సాడుకోవడమే కానీ బాలయ్యకు ఆ సెంచరీని క్యాచ్ చేసుకునే అవకాశం వుందో?లేదో?


Click it and Unblock the Notifications











