బాలయ్య సెంటిమెంటు...రేపు ప్రయాణం
లక్ష్మినరసింహ స్వామి అంటే నందమూరి బాలకృష్ణ కు సెంటిమెంటు అనే విషయం తెలిసిందే. తన ప్రతి సినిమా విడుదలయ్యే సందర్భంలో ఆ స్వామిని దర్శించుకోవడం బాలయ్యకు పరిపాటిగా మారింది. ఇదే సెంటిమెంటును శ్రీరామరాజ్యం సినిమా సమయంలోనూ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యాడు బాలయ్య. బుధవారం తూర్పు గోదావరి జిల్లా పుల్లేటి కుర్రులోని నాగమల్లయ్య సిద్ధాంతి ఇంటికి వచ్చిన బాలయ్య సిద్ధాంతి రాసిన వాస్తు పుస్తకాన్ని ఆవిస్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...శ్రీరామ రాజ్యం సినిమా విడుదల రోజు అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకుంటానని వెల్లడించారు. స్వామిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
ఎన్టీఆర్ ట్రస్టు చైర్మన్ గా ఉన్న బాలయ్య ఈ నెల 19, 20వ తేదీల్లో తమ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగే మెగా వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆసుపత్రులు నిమ్స్, గ్లోబల్, సన్ షైన్, బసవతారకం, క్యాన్సర్ ఆసుపత్రుల నుంచి వైద్య నిపుణులు ఈ శిబిరంలో పాల్గొని రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తారని అన్నారు.


Click it and Unblock the Notifications











