»   »  బాలకృష్ణ తన అభిమానులుకు ఓ ఉత్తరం రాసారు. అందులో ఏం రాసి ఉంటుందంటే

బాలకృష్ణ తన అభిమానులుకు ఓ ఉత్తరం రాసారు. అందులో ఏం రాసి ఉంటుందంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆకాశమే హద్దుగా నన్ను అభిమానించే తెలుగుజాతి ముద్దు బిడ్డలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి వందనాలు. 2010, ఏప్రియల్ 30, సింహం గర్జించిన రోజు, ఆ గర్జన అభిమానులను పులకరింపచేసిన రోజు, రికార్డులు తల్లకిందులయిన రోజు, మీరు నా నుంచి ఎదురు చూసిన విజయం మీకు అందిన రోజు.

మరి 2011...
ఆనాడు నాన్నగారితో సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి చిత్రాలను దర్శకత్వం వహించి, ఎన్టీఆర్ నట ప్రస్ధానంలో తిరుగులేని విజయాలను అందించిన దర్శక కేసరి శ్రీ దాసరి నారాయణరావు గారు నాతో మొట్ట మొదటిసారిగా చిత్రం దర్శకత్వం వహిస్తున్న సంవత్సరం. మీ ఆలోచనలు నాకు తెలుసు. మీ ఊహలు నాకు తెలుసు. మీ అంచనాలు నాకు తెలుసు. మీ అంచనాలు అందనంత గొప్పగా శ్రీ దాసరి గారు పరమవీరచక్ర చిత్రం రూపొందిస్తున్నారు. 2011 సంక్రాంతికి విడుదలయ్యే పరమవీర చక్ర అద్భుతమైన విజయం సాధిస్తుందనటంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. నిర్మాత కళ్యాణ్ గారు ఈ చిత్రం రికార్డులు తిరగరాయాలని ఆశిస్తున్నారు. దాసరి గారు మళ్ళీ ఎన్టీ రామారావు గారని తెరమీద తెలుగు ప్రేక్షకులకు చూపిస్తున్నాను అన్న సంతృప్తి పొందుతున్నారు.

నాన్నగారి వారసుడిగా ఆయన నటించిన ప్రతి పాత్ర ధరించాలని ఉంది. ఆ పాత్రలలో నటించి నాన్నగారిని చూసుకోవాలని అనిపిస్తోంది. అందుకే ముందు ముందు ఇంకెన్నో మహత్తరమైన పాత్రలు మీరు చూడబోతున్నారు. ఈ చిత్రం తర్వాత పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం ఎల్.కుమార్ చౌదరి గారి చిత్రం వస్తుంది. శ్రీరాముడుగా బాపు గారి దర్శకత్వంలో కనిపించబోవటం నా పూర్వ జన్మ సుకృతం. నాన్నగారి లవకుశ చిత్రం ఎన్నిసార్లు చూసానో నాకే తేలీదు. నటుడిగా, నా వంతు కర్తవ్యం నేను నెరవేరుస్తున్నాను. మీరు నా అబిమానులుగా మీ కర్తవ్యం మీరు నిర్వహించాలి.

నందమూరి అభిమానులంటే ప్రపంచంలో తెలుగువాళ్ళు గర్వించే విధంగా ఉండాలి. ఈ కొత్త సంవత్సరంలో మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. చదువుకుంటున్న అబిమానులు విద్యలో వృధ్ది పొందాలని కోరుకుంటున్నాను. మీ తల్లి తండ్రులు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి,మరియు నూతన సంవత్సర శుభాకాంక్షాలు పేరుపేరునా అందచేసానని చెప్పండి. ఎదురుచూస్తూ ఉండండి..జనవరిలో పరమవీర చక్ర పరమాధ్బుతాన్ని సృష్టించబోతోంది. మీ వాడు నందమూరి బాలకృష్ణ అంటూ రాసారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu