భాథ్యతతో...‌:వూతకర్రతో బాలకృష్ణ(ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్‌: సినిమా అయినా రాజకీయమైనా బాలకృష్ణ తీరేవేరు. తను నమ్మినవారి కోసం, తనను నమ్మిన వారి కోసం ఆయన నిరంతంరం పాటుపడుతూనే ఉంటారు. అందుకు తార్కాణం....తాజాగా జరిగిన సంఘటనే. బాలకృష్ణ వూతకర్రతో అసెంబ్లీకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇటీవల జరిగిన సినిమా షూటింగ్‌లో గాయపడ్డ ఆయన అసెంబ్లీ తొలిరోజు సమావేశాలకు వూతకర్ర పట్టుకొచ్చారు. ఆయన అభిమానులు ఈ విషయాన్ని సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో షేర్ చేస్తున్నారు. కాలు ఇబ్బందిగా ఉన్నా హిందూపురం ఎమ్మెల్యే గా భాధ్యతగా ఊతకర్రతో సాయింతో రావటం అందరూ శభాష్ అంటున్నారు.

బాలయ్య...అసెంబ్లీ ఆవరణంలో పలువురు తెలుగుదేశం, వైకాపా ఎమ్మెల్యేలు పరామర్శించి గాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఏడు కుట్లు పడ్డాయని, సోమవారమే వాటిని విప్పారని చెప్పారు. అసెంబ్లీ వాయిదాపడిన వెంటనే బాలకృష్ణ, రోజాలు మాట్లాడుకుంటూ బయటికొచ్చారు. తర్వాత ఆయన అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో మాట్లాడారు.

మీడియాతో మాట్లాడుతూ... తన 100వ సినిమాపై స్పందిస్తూ.....సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయని, అంచనాలకు తగిన విధంగానే 100వ సినిమా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం సత్యదేవా దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే 100వ సినిమాకు సంబందించిన వివరాలు వెల్లడిస్తామన్నారు.

Balakrishna With Stick At Assembly

బాలయ్య తాజా సినిమా వివరాల్లోకి వెళితే... నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. బాలయ్య సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సమక్షంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సీన్స్ లో బాలయ్య డూప్ లేకుండా...చాలా రీస్కీ ఫైట్స్ చేస్తూ స్వల్పంగా గాయపడ్డారు.

ఆయన కాలికి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయం నుండి కోలుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట ప్రసాద్, కళ: రవీందర్, కార్యనిర్వాహక నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాత: రుద్రపాటి రమణారావు, రచన-దర్శకత్వం: సత్యదేవ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X