'సింహా' లో ఆ సీన్స్ మేకప్ లేకుండానే...: బాలకృష్ణ
మీకో విషయం చెప్పనా 'సింహా' సినిమాలో తండ్రి పాత్రకోసం నేను మేకప్ లేకుండా నటించాను.ఇలా వైవిధ్యం కలిగిన రెండు పాత్రలను ఒకే సినిమాలో చేసే అవకాశం రావడం కూడా సంతృప్తి కలిగించే అంశం అంటున్నారు బాలకృష్ణ. ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన 'సింహా' చిత్రంలో తన పాత్రలు గురించి ఇలా చెప్పుకొచ్చారు. అలాగే అలా రెండు పాత్రలు చేయటం తన తండ్రినుంచి స్పూర్తి పొందుతానని చెపుతూ...ద్విపాత్రాభినయం అంటే మా నాన్నగారి రోజులు గుర్తుకు వస్తాయి. నాన్నగారు నటించిన 'సర్దార్ పాపారాయుడు', 'కొండవీటి సింహం' తదితర చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేస్తూ బరువైన పాత్రలు ఒక పక్క, చలాకీగా హుషారుగా ఉండే పాత్రలు మరో పక్క చేస్తుండేవారు.
ఆయన మార్గాన్ని అనుసరిస్తూ అప్పుడప్పుడు అలాంటి పాత్రలు చేస్తున్నాను. 'సింహా' చిత్రంలో నేను పోషించిన రెండు పాత్రల మధ్య చాలా తేడా ఉందని, రెంటినీ బాగా పోషించానని అందరూ అభినందిస్తుంటే ఆనందంగా ఉంది అన్నారు. అలాగే అంతా తనను మెచ్చుకుంటున్నారని...చెప్తూ... 'ఓహో..బాలయ్య నుంచి ఏం తీసుకోవాలో ఇప్పుడు మాకు అర్థమైంది' అని సినిమావాళ్లే అంటున్నారు. నేను పరిశ్రమకి వచ్చిన 34 ఏళ్ల తర్వాత కూడా కొత్తగా ఇలా అనడం నాకు ఆనందంగా ఉంది. అంటే ఈ సినిమా నుంచి ఒక కొత్త బాలకృష్ణని చూస్తున్నారన్న మాట. అందుకే నా కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని అంటున్నాను అని ఆనందంగా వివరించారు.


Click it and Unblock the Notifications











