వీరాభిమాని ఇంటికి బాలయ్య
బాలకృష్ణ వీరాభిమాని నయనార్ రఘు(ఎన్ బి కె రఘు)శ్రీకాళహస్తిలో బుధవారం మరణించారు. మరుసటి రోజు బాలయ్య తన షెడ్యూలు ప్రక్కన పెట్టి అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మూడు లక్షల రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. అంతేగాక అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని అతని కూతురుకు ఉద్యోగం ఇప్పిస్తానని ప్రామిస్ చేసారు. ఇక నయనార్ రఘు నేటివ్ శ్రీకాళహస్తి. మొదటి నుంచీ నందమూరి ఫ్యామిలీ అంటే అభిమానం చూపేవాడు..అందులోనూ బాలకృష్ణ అంటే ప్రాణం పెట్టేవాడు. అతను మరణించటంతో ఎక్కడెక్కడి బాలకృష్ణ అభిమానులు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్సిస్తున్నారు. రఘు కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక బాలకృష్ణ ఆ ఇంటివద్ద ఒక గంటకు పైగా గడిపారు. ఆయన్ని చూడటానికి జనం ఎగబడ్డారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ..బోయపాటి శీను దర్శకత్వంలో సింహా చిత్రాన్ని చేస్తున్నారు.
బాలకృష్ణ సింహా మిత్రుడు నయనార్ రఘు కాళహస్తి మరణం మూడు లక్షలు బోయపాటి శీను balakrishna deceasedfan nayanarraghu srikalahasti chitturdist boyapatisreenu simha


Click it and Unblock the Notifications