జెండా పండుగలో బాలయ్య సందడి
పంద్రాగస్టు జెండా పండుగ సందర్భంగా సినీనటుడు బాలకృష్ణ భ్రదాచలంలో సందడి చేశారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో జాతీయ జెండా ఆవిష్కరించారు. త్వరలో విడుదల కాబోతున్న తన 'శ్రీరామరాజ్యం" సినిమా ఆడియో విడుదల కార్య్రకమం భద్రాద్రి రాముడి సన్నిధిలో ఏర్పాటు చేసిన సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడికి వచ్చారు. తమ అభిమాన నటుడు రావడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
లార్డ్ శ్రీరామ చరిత్రను ఆధారంగా చేసుకుని....ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో, బాలకృష్ణ-నయనార నాయికా నాయికలుగా, యలమంచిలి సాయిబాబు శ్రీరామరాజ్యం సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications