‘బాలరాజు ఆడి బామ్మర్ధి’ విడుదల తేదీ ఖరారు
శ్రీహరి, ఆర్యన్ రాజేష్, శ్రద్దాఆర్య ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'బాలరాజు ఆడి బామ్మర్ధి'. రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని సి.వి.రావు, ముత్యాల రాందాస్ సమర్పణలో సుధా ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ చిత్రంలో బాల రాజుగా శ్రీహరి, అతని సోదరిగా శ్రద్ధా ఆర్య నటించగా, బావమరిదిగా ఆర్యన్ రాజేష్ కనిపిస్తారు. పాటలతో పాటు ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. అగస్త్య సంగీతం వీనుల విందుగా ఉంటుంది అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చరణ్ రాజ్, రఘుబాబు, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, హర్ష తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, ఛాయాగ్రణం: రాజేంద్ర, ఎడిటింగ్: శంకర్, ఆర్ట్స్: మురళి, సమర్పణ: సి.వి.రావు, ముత్యాల రాందాస్, నిర్మాత: శ్రీనివాస్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రామకృష్ణ.


Click it and Unblock the Notifications











