For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య 'సింహా' సంక్రాతి స్పెషల్!!

    By Staff
    |

    భద్ర, తులసి వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్నంలో యువరత్న బాలకృష్ణ కథానాయకుడుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న భారీ చిత్రం 'సింహా'. స్నేహ ఉల్లాల్, నమిత హీరోయిన్లు. ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

    పరుచూరి కీరీటి ఆ విశేషాలను తెలియజేస్తూ, ఫిల్మ్ సిటీలో ఎ.ఎస్.ప్రకాష్ కళాదర్శకత్వంలో వేసిన మూడు భారీ సెట్స్ లో బాలకృష్ణ, నమిత జంటపై ఓ పాటను చిత్రీకరిస్తున్నామనీ, దీనికి ప్రేమ్ రక్షత్ కొరియోగ్రఫీ అందిస్తున్నారనీ తెలిపారు. ఈ నెలాఖరులో ఇక్కడే మరో మూడు భారీ సెట్స్ వేసి బాలకృష్ణ, స్నేహ ఉల్లాల్ పై మరో పాటను తీయబోతున్నట్టు చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి.మహేంద్రబాబు మాట్లాడుతూ ఏకధాటిగా హైద్రాబాద్, వైజాగ్ లలో జరిగే షూటింగ్ తో సినిమా పూర్తవుతుందని తెలిపారు. 2010 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రఘు, కోట శ్రీనివాసరావు, ఆదిత్య మీనన్, కెఆర్ విజయ, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఆలీ, ధర్మవరపు, కృష్ణ భగవాన్, ఎల్బీ శ్రీరాం, ఝాన్సీ, సైరాబాను, వినోద్, ప్రముఖ మలయాళ విలన్ సాయికుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని చక్రి అందిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X