»   » 1937 కాలంలో తెలుగు సినిమా పోస్టర్ ఇలా ఉండేది (ఫోటో)

1937 కాలంలో తెలుగు సినిమా పోస్టర్ ఇలా ఉండేది (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పుడంటే సినిమా పోస్టర్లు రంగులు రంగులుగా, ఆకట్టుకునే విధంగా, స్టైలిస్ ఫోటోగ్రాపీతో కలగలిపి ఉంటున్నాయి. కానీ తెలుగు సినీ పరిశ్రమ తొలి నాళ్లలో పరిస్థితి ఎలా ఉండేది? అప్పట్లో అచ్చు యంత్రమే తప్ప.... డిజిటల్ ప్రింటింగ్, కలర్ ప్రింటింగులు గట్రా లేవు.

తాజాగా ఆ కాలం నాటి పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 1937లో వచ్చిన ‘బాల యోగిని' సినిమాకు సంబంధించిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. గుంపులు గుంపులుగా పోవుచున్నారు. అద్భుత రెండో వారము, క్రౌన్ టాకీసు మద్రాసులో ‘బాల యోగిని' తెలుగు అంటూ పోస్టర్ రూపొందించారు.

 Balayogini (1937) First Look Poster

అప్పట్లో ప్రింటింగ్ పోస్టర్ అనేదే ఓ ఆశ్చర్యం....... సినిమా అనేది మహాశ్చర్యం. మద్రాసు లాంటి నగరాలు.... విజయవాడ, విశాఖపట్టణం, నెల్లూరు, విజయనగరం లాంటి పట్టణాల్లో తప్ప జనాలకు సినిమా అందుబాటులో ఉండేది కాదు. విజయవాడ లాంటి పట్టణాల్లో సినిమా ఆడుతుందంటే పల్లె ప్రాంతాల నుండి జనాలు ఎడ్ల బండ్ల కట్టుకుని జాతరకు వచ్చినట్లు వచ్చే వారట.

టెక్నాలజీ పుణ్యమా అని ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అర చేతిలో మొబైల్ ఫోన్లో కూడా సినిమా చూసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మున్ముందు టెక్నాలజీ ఎన్నికొత్త పుంతలు తొక్కుతుందో?

English summary
Balayogini is a 1937 film made in Tamil and Telugu. It was directed by K. Subramanyam.
Please Wait while comments are loading...