ఘనంగా బాలయ్య 50వ జన్మదిన వేడుకలు

By Pratap

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు బాలయ్య తన 50వ జన్మదినాన్ని గురువారం అభిమానుల మధ్య హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దాసరి నారాయణరావు దర్శకత్వంలో నటిస్తున్న పరమవీర చక్ర షూటింగ్ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సినిమాకు క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఐదు వేల మంది అభిమానులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

బాలయ్య కేక్ కట్ చేసి తన జన్మదినం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, కళ్యాణ్ రామ్, తారక రత్న తదితురులు హాజరయ్యారు. పరమవీర చక్ర చిత్రాన్ని కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. బాలయ్యను ప్రముఖులు అభినందించారు. బాలకృష్ణ బెబ్బులిపులి డైలాగులు వినిపించి అభిమానులను అలరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X