'అధినాయకుడు'తో బాలకృష్ణ రాజకీయాలో రియల్ హీరో అవుతాడా...!?
అధినాయకుడు పేరుతొ ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకుంటున్న నందమూరి బాలయ్య చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. మిగిలిన కొన్ని సన్నివేశాలను గురువారం నుంచి కర్నూల్ లో చిత్రీకరించనున్నారు. అనంతరం ఆఫిషియల్ టైటిల్, ఫస్ట్ లుక్ అధికారికంగా విడుదల చేస్తారని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీ కీర్తి బ్యానర్ ఫై ఎంఎల్ పద్మ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీస్ సలోని, లక్ష్మి రాయ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
కాగా, అధినాయకుడు అంటే అసలైన నాయకుడు ఎలా ఉండాలో ఈ చిత్రంలో చూడొచ్చు, అంటున్నారు దర్శకుడు పరుచూరి మురళి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలయ్య బాబు మూడు వేర్వేరు పవర్ ఫుల్ పాత్రల్లో కనిపిస్తారు. ఒక నిజమైన నాయకుడు అష్ట కష్టాలకోర్చి ప్రజల కోసం ఎలా నిలబడతాడు అనేది ఈ చిత్ర ఇతివ్రుత్తాంతంగా ఉంటుంది. ఇందంతా చూస్తుంటే నందమూరి బాలకృష్ణ నటిస్తున్నసినిమా అధినాయకుడు , ఆయనను రాజకీయాలకు దగ్గర చేస్తుందా అంటే..., అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఎందుకంటే ఈ సినిమా టైటిల్ 'అధినాయకుడు" అని పెట్టినప్పటి నుంచే నందమూరి అభిమానులలోనూ, ప్రేక్షకుల లోనూ ప్రత్యేక ఆసక్తి ఉంది. 'ప్రజలకు సేవ చేసే నిజమైన నేత, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో అధినాయకుడు చూపిస్తుందని దర్శకుడు చెప్పిన మాటలు కూడా మరింత ఆసక్తి పెంచుతున్నాయి.
ఇంకా ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని తెలుస్తుంది. ఈ మధ్య అనంతపురంలో బాలయ్య ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తాననడం, కొందరు టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరి బాలయ్యను గెలిపిస్తామని చెప్పారు. ఆ విధంగా చూస్తే అధినాయకుడు మరింత ప్రాధాన్యత సంపాదించుకుంటుంది. ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావడానికి ముందు పవర్ పుల్ సినిమాలు చేయడం కలిసి వచ్చింది, ఇప్పుడు బాలయ్య కూడా అదే బాటలో అధినాయకుడు వంటి సినిమాలో మూడు పవర్ పుల్ క్యారక్టర్ లో నటిస్తున్నారని కూడా టిడిపి అభిమానులు చెబుతున్నారు. నవంబర్ 10 న బాలయ్య భక్తిరస మహత్తర చిత్రం 'శ్రీ రామ రాజ్యం" విడుదల కానున్న నేపధ్యంలో అనంతరం అధినాయకుడు తెర పైకి వస్తుంది.


Click it and Unblock the Notifications











