రేర్ ఫీట్: నందమూరి బాలకృష్ణ 40

By Bojja Kumar

హైదరాబాద్: నటుడిగా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగడం అంటే ఆశామాషయం కాదు. కానీ నందమూరి నట సింహం బాలకృష్ణ తన నట ప్రస్తానంలో ఏకంగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. నందమూరి తారక రామారావు వారసుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ అనతి కాలంలోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోగా ఎదిగారు. ఈ ఏడాదితో బాలకృష్ణ నటుడిగా రంగ్రపవేశం చేసి 40 నలభై ఏళ్లయింది.

'తాతమ్మ కల' చిత్రంతో 1974లో 14 ఏళ్ళ వయసులోనే బాలనటుడిగా తెరంగేట్రం చేశారు బాలకృష్ణ. ఆ తరువాత 'రామ్‌ రహీం', 'అన్నదమ్ముల అనుబంధం' చిత్రాల్లో నటించి నటవారసత్వాన్ని కొనసాగించారు. తన తండ్రి స్వీయ దర్శకత్వంలో వచ్చిన దాన వీర శూర కర్ణ, అక్బర్‌ సలీం అనార్కలి, శ్రీ మద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం, శ్రీ మద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి మెప్పించారు బాలకృష్ణ. ముఖ్యంగా శ్రీ మద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రలో పోషించిన సిద్ధయ్య పాత్ర బాలకృష్ణలో ఎంత మంచి నటుడు ఉన్నాడో నిరూపించింది.

Balayya career @ 40 years

'సాహసమే జీవితం' సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారారు బాలకృష్ణ. పౌరణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటిస్తూ ఎన్టీఆర్ కి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. మంగమ్మగారి మనవడు, కథానాయకుడు, బాబాయ్ అబ్బాయి, భలే తమ్ముడు, సీతారామ కళ్యాణం, అనుసూయమ్మగారి అల్లుడు బాలకృష్ణను స్టార్ హీరోగా నిలిపాయి. ఇక, ఆదిత్య 369 లాంటి సోసియేఫాంటసీ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో ఓ మైలురాయి. ఆ చిత్రం తరువాత వచ్చిన జానపద చిత్రం భైరవద్వీపం సరికొత్త రికార్డులను నెలకొల్పింది.

ఇక, సమరసింహారెడ్డి అయితే 1990లలో ఓ ట్రెండ్ సెట్టర్. ఆ తర్వాత రెండేళ్లకు చేసిన నరసింహ నాయుడు అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను తిరగ రాసింది. తర్వాత లక్ష్మీనరసింహా, సింహా తదితర చిత్రాల్లో బాలయ్య దుమ్ము రేపారు. ఇక, ఇటీవలి కాలంలో వచ్చిన శ్రీరామరాజ్యంలో రామునిగా బాలయ్య ఒదిగిపోయిన వైనం చూసినవాళ్లు, నేటి తరంలో పౌరాణిక పాత్రలు చేయగల సత్తా ఉన్న నటుడు బాలకృష్ణే అని ప్రశంసించారు. రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తూ, 40ఏళ్లుగా నిరవధికంగా సినిమాలు చేస్తున్న బాలయ్య వంద చిత్రాలకు చేరవయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X