ఆ రెండు చేయాలని ఉవ్విల్లూరుతున్న బాలయ్య
తెలుగు సినిమా ఇండస్ట్రీ అగ్రహీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. నటన, డాన్సుల విషయంలో ఇతర నటులతో పోలిక సంగతి పక్కన పెడితే....పౌరాణిక పాత్రల విషయంలో మాత్రం బాలయ్యకు ప్రత్యేక స్థానం ఉంది. బహుషా ఆ విషయంలో బాలయ్యను మించినోడు ఇండస్ట్రీలో లేడనుకుంటా!
బాలకృష్ణ తండ్రి స్వర్గీయ ది గ్రేట్ ఎన్.టి.రామారావు అప్పట్లో పారాణిక పాత్రలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేశారు. ఎన్టీవోడి నటన చూసి... రాముడు, కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడని ఫిక్సయిపోయేవారంతా. కంచి కామకోటి పీఠాధిపతి స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి తన జీవిత కాలంలో చూసిన ఏకైక సినిమా ఎన్టీఆర్ నటించిన సీతారామ కళ్యాణం మాత్రమే అంటే ఎన్టీఆర్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందులో ఎన్టీఆర్ నటనకు ముగ్దుడైన స్వామీజీ......ఎన్టీఆర్‌కు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదు ఇచ్చారు.
తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకుంటున్న బాలయ్య....అనాడు తండ్రి నటించిన సూపర్ హిట్ సినిమాలు 'సీతా రామ కళ్యాణం, నర్తనశాల" రీమేక‌్ లో నటించి పౌరాణిక సినిమాల విషయంలో తండ్రి సరసన చేరాలని ఉవ్విల్లూరుతున్నాడు. మరి బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్టులఃను ఎప్పుడు పూర్తి చేసి చూపిస్తాడో అని అభిమానునులు ఆసక్తిగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











