ఫోటోలు: బాలయ్య ఇంట్లో విద్యాబాలన్ సందడి.. చీర బహుకరణ!
స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తున్నాడు. బాలయ్య ఈ చిత్రం విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాడు. బడ్జెట్ ఎక్కువైనా కూడా అన్ని పక్కాగా కుదిరేలా చూసుకుంటున్నాడు.
అందుకే ఏరికోరి మరీ ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ని ఎంపిక చేసుకున్నారు. నేడు విద్యాబాలన్ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా బాలయ్య ఫ్యామిలీ విద్యాబాలన్ కు ఘనస్వాగతం పలికారు.

విద్యాబాలన్ బాలయ్య ఇంట్లో సందడి చేసింది. బాలయ్య కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటించింది. బాలకృష్ణ ఫ్యామిలీ విద్యాబాలన్ కు ఓ చీరని బహుకరించారు. బాలయ్య ఇంట్లో ఉన్న విద్యాబాలన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఇతర నటీనటుల విషయంలో ఇంకా క్లారిటీ రావలసి ఉంది. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఈ చిత్రంలో టీనేజ్ ఎన్టీఆర్ గా కనిపించబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











