పరమవీరచక్రలో బాలయ్య హీరోయిన్లు ఎవరు?
షూటింగ్ ప్రారంభోత్సవంతోనే క్రేజ్ సృష్టించుకున్న పరమవీర చక్ర సినిమాలో బాలకృష్ణ సరనస నటించే హీరోయిన్లు ఎవరనే చర్చ సాగుతోంది. టాలీవుడ్ లో దీనిపై చెవులు కొరుక్కుంటున్నారు. దాసరి నారాయణరావు 150 చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అందువల్ల బాలయ్య సరసన నటించే హీరోయిన్ల ఎంపికపై జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. బాలయ్యకు ఇద్దరు హీరోయిన్ల సెంటిమెంటు ఉంది. అందువల్ల ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉంటారని ప్రచారం సాగుతోంది. ఒక్క మగాడులో కిర్రెక్కించిన అనుష్క బాలయ్య సరసన ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకుంటున్నారు. రెండో హీరోయిన్ గా హిన్సికను ఎంపిక చేస్తారట.
కాగా, మరో విశేషం కూడా ఈ సినిమాకు ఉంది. పార్లమెంటు సభ్యురాలు, సీనియర్ నటి జయప్రద పరమవీర చక్రలో కీలకమైన పాత్ర పోషిస్తుందట. గతంలో కూడా బాలయ్య సినిమాలో జయప్రద కనిపించింది. ఈ సినిమాలో మాత్రం జయప్రద కాస్తా ఎక్కువ నిడివి ఉండే, కథలో కీలకమైన మలుపు తిప్పే పాత్రను పోషిస్తుందట. ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తారు.


Click it and Unblock the Notifications











