»   » ఊహించని ట్విస్ట్: 100వ సినిమా సైన్స్ ఫిక్షన్, ఖరారు చేసిన బాలయ్య!

ఊహించని ట్విస్ట్: 100వ సినిమా సైన్స్ ఫిక్షన్, ఖరారు చేసిన బాలయ్య!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ మైల్ స్టోన్ మూవీ 100వ సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బోయపాటి దర్శకత్వంలోనే ఉంటుందని అంతా ఊహించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బాలయ్య 100వ సినిమా విషయంలో ట్విస్ట్ ఇచ్చారు.

తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ను ‘డిక్టేటర్' మూవీ చూడటానికి ఆహ్వానించిన బాలయ్య ఈ సందర్భంగా తన 100వ సినిమా విషయం ఖరారు చేరారు. ‘ఆదిత్య 369' సీక్వెల్ గా తీయబోయే సినిమాయే తన 100వ ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని వెల్లడించినట్లు సమాచారం.


టైం మిషన్ కాన్సెప్టుతో సైన్స్ ఫిక్షన్ మూవీగా ఇది ఉండబోతోందని బాలయ్య వెల్లడించినట్లు సమాచారం. ‘ఆదిత్య 369' చిత్రానికి సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. బాలయ్య 100వ సినిమాకు కూడా ఆయనే దర్శకత్వం వహిస్తారా? లేదా? ఎవరు నిర్మిస్తారు అనే విషయాలు వెల్లడి కావాల్సి ఉంది.


Balayya inviting Telangana Chief Minister KCR to watch Dictator special screening

డిక్టేటర్ సినిమాకు ముందు ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ....100వ సినిమా బోయపాటి దర్శకత్వంలోనే ఉంటుందా? అనే ప్రశ్నకు బాలయ్య స్పందిస్తూ...సినిమా ఎవరితో చేయాలనే విషయమై చర్చలు జరుగుతున్నాయి. మార్చికల్లా 100వ సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నాను.


సింగితం శ్రీనివాస్ గారు ‘ఆదిత్య 369' సీక్వెల్ కథతో సహా సిద్ధంగా ఉన్న మాట నిజమే. అయితే ఈ సినిమా విషయంలో నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చేయాలా? వద్దా? అనేది సంక్రాంతి పండగ తర్వాత నిర్ణయం తీసుకుంటాను అన్నారు బాలయ్య. 100వ సినిమాలో మోక్షజ్ఞను తీసుకోవాలనే ఆలోచన అయితే ఉంది కానీ అప్పటికీ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేను అన్నారు బాలయ్య.

Read more about: dictator balayya kcr
English summary
After inviting Telangana Chief Minister KCR to watch "Dictator" special screening, Balayya confirmed to him that Aditya 369 sequel is going to be the landmark 100th film everyone is waiting for.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu