బాలయ్య ఎంటరయ్యాడు... జూ ఎన్టీఆర్, ఫ్యాన్స్ హ్యాపీ!

బాలయ్య కాలికి గాయం అయిందనే విషయం తెలియగానే అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే జూ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు సందేశం పంపారు. .'బాబాయ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అభిమానులు ఆందోళన చెందవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. సింహం క్షేమంగానే ఉంది. మళ్లీ వచ్చి గర్జిస్తుంది' అంటూ ఎన్టీఆర్ ట్విట్ చేసారు. బాలయ్య మళ్లీ షూటింగులో ఎంటర్ కావడంతో జూ ఎన్టీఆర్, ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.
బాలయ్య నటిస్తున్న సినిమా విషయానికొస్తే...ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈచిత్రంలో బాలయ్య సరసన త్రిష కథనాయికగా నటిస్తోంది. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సమక్షంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సీన్స్ లో బాలయ్య డూప్ లేకుండా...చాలా రీస్కీ ఫైట్స్ చేస్తూ స్వల్పంగా గాయపడ్డారు.ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట ప్రసాద్, కళ: రవీందర్, కార్యనిర్వాహక నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాత: రుద్రపాటి రమణారావు, రచన-దర్శకత్వం: సత్యదేవ.


Click it and Unblock the Notifications