ఎట్టకేలకు బాలయ్య-మనోజ్ మూవీ ఆడియో...
నందమూరి నటసింహం బాలకృష్ణ అతిథి పాత్రలో...మనోజ్, దీక్షా సేథ్ హీరో హీరోయిన్లుగా మంచు ఎంటర్ టైన్మెంట్స్ బేనర్‌పై రూపొందుతున్న 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం ఆడియో విడుదల తేదీ ఖరారైంది. రేపు(మే 30) శిల్పకళా వేదికలో ఆడియో వేడుదల కార్యక్రమం ఏర్పాటు చేశారు. బెబో శశి ఈచిత్రానికి సంగీతం అందించారు. పరిశ్రమలోని పలువరు ప్రముఖులు ఈకార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఈచిత్రంలో బాలకృష్ణ జమిందార్ నరసింహ నాయుడుగా కనిపించనున్నాడు. బాలకృష్ణ ఆత్మగా కనపడతారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. చంద్రముఖి తరహా గాంధర్వ మహల్ భవంతిలోకి హీరో మనోజ్ ప్రవేశించాక కథ మొదలవుతుందని, అక్కడ బాలకృష్ణ ఆత్మ కలుస్తుందని చెప్పుకుంటున్నారు.
తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం 6.5 కోట్లతో గాంధర్వ మహల్ సెట్టింగ్ వేయడం ఇప్పుడు పరిశ్రమ వర్గాలను షాక్ కు గురి చేస్తోంది. ఈ చిత్రాన్ని కృష్ణ వంశీ శిష్యుడు శేఖర్ రాజా రూపొందిస్తున్నారు. మంచు లక్ష్మి నిర్మాత. బాలయ్య కు ఉన్న ఫాలోయింగ్‌తో సినిమా హిట్ అవుతుందనే నమ్మకంలో ఉన్నారంతా.
ముఖ్యంగా ఈచిత్రంలో గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈచిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు హీరో మంచు మనోజ్ స్వయంగా దర్శకత్వం వహించారు. బాలయ్యపై చిత్రీకరించిన సన్నివేశాలను మనోజ్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. మరి అవి ఏ రేంజిలో ఉంటాయో సినిమా విడుదలైతేగానీ తెలియదు.


Click it and Unblock the Notifications











