సంక్రాంతి బరిలోకి బాలయ్య పరమవీర చక్ర కూడా...

By Sindhu

దర్శక రత్న దాసరి నారాయణ రావు 150వ చిత్రం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పరమవీరచక్ర చిత్రం షూటింగ్ పూర్తికావస్తోంది. బాలకృష్ణ సరసన ఈ చిత్రంలో అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ వివిధ రకాల వేషధారణల్లో కనిపించనున్నట్టు సమాచారం. సైనికుడిగా రణరంగంలో శత్రువులపై పోరాటం చేస్తే సినిమా హీరో ఏం చేస్తాడనేది ఆసక్తికరం. శుక్రవారంతో కులుమనాలిలో ఓ షెడ్యూలు పూర్తి చేసుకోనుంది. నవంబర్ 25 నుంచి హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఆ తర్వాత 3 పాటల్ని ఈజిప్టు, కెన్యా, జుడాంగ్ లో చిత్రీకరించనున్నారు. డిసెంబర్ నెలాఖరులో పాటల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల కావచ్చు. ఈ చిత్రంలో మేజర్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ పాత్ర, అది పలికే సంభాషణలు నందమూరి అటు నందమూరి అభిమానుల్నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తాయి సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X