మాజీ సైనికులతో వివాదాల్లో చిక్కుకున్న బాలకృష్ణ !?

By Sindhu

యువరత్న బాలకృష్ణ హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు 150వ చిత్రంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 'పరమవీర చక్ర" షూటింగ్ మొదలైన రెండు రోజులకే వివాదాల్లో చిక్కుకుంది. దర్శకరత్న, యువరత్న తొలి కలయికలో రూపొందుతున్న 'పరమవీర చక్ర" గ్రేట్ 'బొబ్బలిసింహం' చిత్రం వంటి సక్సెస్ ను అందుకుంటుంది అనుకునేలోపే వివాదాల్లో చిక్కుకుంది. అది అలా వుంటే సరిహద్దుల్లో జవాన్ల వీరోచిత పోరాటాలకు ప్రతీకగా ఇచ్చే 'పరమవీర చక్ర"ను సినిమా టైటిల్ గా పెట్టవద్దని మాజీ సైనీకులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై మాజీ సైనికుల అభిప్రాయం ప్రకారం 'పరమవీర చక్ర" టైటిల్ పెట్టిన సినిమాలో గ్లామర్ గా డాన్స్ లు, అభిమానులను ఆకట్టుకునే విధంగా హీరోయిన్స్ వేసే డ్రస్సులు, ఒకరిని కించపరిచే డైలాగులు వంటివి ఎన్నో హంగులు పెట్టి ప్రేక్షకులను ఆకర్షించే విధంగా సినిమాని తయారు చేస్తారు. సినిమా చూసి బయటికి వచ్చిన ప్రేక్షకులు అబ్బా పరమవీర చక్రలో ఈసీన్ ఇలా ఉంది, ఆ సీన్ అలా వుంది, హీరోయిన్స్ పై కామెంట్స్ చేస్తున్నప్పుడు అవమానం ఎవరికి..? 'పరమవీర చక్ర"కే కదా..

అయితే బాలయ్య మాత్రం 'పరమవీర చక్ర" సైనికుల గౌరవాన్ని పెంచుతుందని, వారి లైఫ్ స్టైల్ ను అందరికీ దగ్గరగా చూపిస్తుందని బాలయ్యతోపాటు టీడీపి నేతలు కూడా అంటున్నారు. మొత్తానికి హీరోయిన్ గ్లామర్, పంచ్ డైలాగులు లేనిదే సినిమా డబ్బు సంపాదించదు. కనుక దర్శకరత్న మరో కోనంలో కూడా ఆలోచనలో పడ్డట్టు ఫిల్మింనగర్ వర్గాల సమాచారం. బాలయ్యకు సెంటిమెంట్ గా వస్తున్న 'సింహా"(సమర'సింహా "రెడ్డి, నర'సింహా"నాయుడు, 'సింహా", లక్ష్మీ నర'సింహా", బొబ్బిలి'సింహం") దృష్టిలో పెట్టుకొని 'జయసింహా"గా టైటిల్ మార్చవచ్చని ఇంతకు ముందే ఈ పేరును ఫిల్మించాంబర్ లో రిజిస్టర్డ్ అయిందని సినీఇండస్ట్రీలో టాక్. మరి అయితే వివాదాల్లో చిక్కుకున్న 'పరమవీర చక్ర" సమస్య ఎలా వీడుతుందో..దర్శకరత్న ఏ విధంగా ఈ చిత్రన్ని తెరకెక్కిస్తారో ఈ సినిమా భవిష్యత్ ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం 'జయసింహా"డబుల్ రికార్డే అని సంతోపడుతున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X