బాలయ్య, రవిచావలి చిత్రం విశేషాలు
నట సింహ నందమూరి బాలకృష్ణ రవి చావలి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరి 6న హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి 'కల్కి' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అయితే దర్శక నిర్మాతలు దీన్ని ఇంకా ఖరారు చేయలేదు. అధినాయకుడు చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత బాలయ్య రవి చావాలితో చేయబోయే చిత్రం షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నారు.
దర్శకుడు రవి చావలి బాలయ్యను ఈ చిత్రంలో కొత్త కోణంలో చూపించడంతో పాటు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ జతకలిపి సినిమా కథ, స్క్రిప్టు తయారు చేసుకున్నాడు. ఇందులో బాలయ్య సరసన పార్వతి మెల్టన్ లీడ్ హీరోయిన్‌గా నటించనుంది. రమేష్ పుప్పాల యల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
రవి చావలి ఇదివరకు సుమంత్ హీరోగా దూరంగా దగ్గరగా చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం పార్వతి మెల్టన్ యమహో యమా చిత్రంలో రామ్ శంకర్ తో కలిసి నటిస్తోంది. ఈ ఇద్దరికి బాలయ్య లాంటి స్టార్ హీరోతో తొలి సినిమా కావడంతో ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నారు.


Click it and Unblock the Notifications











