“డిక్టేటర్” ప్రాజెక్టు పై బాలయ్య బాంబు, ఇంకా చాలా వాటిపై వివరణ

By Srikanya

హైదరాబాద్ : 'ఇంకా కథ పూర్తిగా వినలేదు. ఆ పేరుని కూడా ఖరారు చేయలేదు. లైన్‌ మాత్రమే విన్నా. కథలో కొన్ని మార్పుల కోసం ప్రయత్నిస్తున్నాం. కుదిరితేనే చేస్తా, లేదంటే మరో కథని ఎంచుకొంటా' అంటూ కూల్ గా బాలకృష్ణ ట్విస్ట్ ఇచ్చారు. 'డిక్టేటర్‌' కథ ఎలా ఉండబోతోంది? అని మీడియావారు అడిగితే ఇలా సమాధానం చెప్పారు.

మే 29 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది అనుకున్న సమయంలో బాలకృష్ణ ఈ బాంబుని పేల్చారు. ఓ ప్రక్క కోన వెంకట్, శ్రీవాస్ ఈ ప్రాజెక్టుకు సంభందించిన పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతకీ ఈ విషయమై వీరిద్దరూ ఏమంటారో చూడాలి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక బాలకృష్ణ ఎప్పుడూ...ఒక రకమైన సినిమాలకో, పాత్రలకో పరిమితం కాని నటుడు. తన తండ్రి ఎన్టీఆర్‌ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొన్నారు. పౌరాణికం, జానపదం, సాంఘిక తేడాల్లేకుండా అన్ని రకాల చిత్రాలు చేశారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొన్నారు.

దాదాపు నలభై ఏళ్లుగా బాక్సాఫీసును ప్రభావితం చేస్తూనే ఉన్నారు బాలకృష్ణ. తన సినిమాలతో కథల్ని కొత్త పుంతలు తొక్కిస్తుంటారు, ట్రెండ్‌నూ మార్చేస్తూ వస్తున్నారు. అందుకే బాలకృష్ణ సినిమా అంటే బాక్సాఫీసు దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంటుంది. 'లయన్‌'తో మరోసారి ఆయన ఆ సందడిని తీసుకొచ్చారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో ముచ్చటించారు.

స్లైడ్ షోలో బాలకృష్ణ ఏమన్నారు...అనేది చూద్దాం

గాడ్సే పాత్రకు అభిమానులు ఫీలవుతారని భావించలేదా

గాడ్సే పాత్రకు అభిమానులు ఫీలవుతారని భావించలేదా

ఏదైనా కొత్తగా చేయకపోతే నాకే బోర్ కొట్టేస్తుంది. ఆ రోజుల్లో నాన్నగారు ఏన్నో డిఫెరెంట్ రోల్స్ చేసారు. అలాగే నేను కూడా నటుడ్ని అన్ని ట్రై చేస్తాను. అభిమానులు కోరుకునే అంశాలు ఉండేలా చూసుకుంటాను.

'లయన్‌'కి ఎలాంటి స్పందన లభిస్తోంది?

'లయన్‌'కి ఎలాంటి స్పందన లభిస్తోంది?

చాలా బాగుందండీ. చూసిన ప్రతి ఒక్కరూ కొత్తదనంతో కూడిన కథ అంటున్నారు. సాంకేతికంగా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. కొత్తదనాన్ని ఆదరించడం తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఓ గొప్ప లక్షణం. అందుకే మొదట అభినందించాల్సింది వాళ్లనే.

నాకోసమే అంటారు.

నాకోసమే అంటారు.

నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ కథ నాకోసమే అని చెప్తూంటారు. అప్పుడు నేను కాదు దీన్ని వేరే హీరో ల దగ్గరకూడా చెప్పారు. నాకోసం కథ ఉంటే చెప్పండి అంటాను. ఎదుటి వ్యక్తి ఎంత నిజాయితీ గా వ్యవహిస్తారడనేది గ్రహించేస్తా.

లయిన్ లో ...ఏం ఆకట్టుకుంది?

లయిన్ లో ...ఏం ఆకట్టుకుంది?

కథ, సాంకేతికతలే. ఇటీవల కాలంలో మారుమూల పల్లెలకీ సాంకేతికత విస్తరించింది. అందరికీ సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్‌ అనీ, అదనీ ఇదనీ మాట్లాడుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనమూ సాంకేతికంగా ముందడుగు వేయాల్సిందే. 'లయన్‌' ఆ విలువల మేరకే తెరకెక్కింది.

చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవారుట

చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవారుట

అవును...ప్రెండ్స్ తో బాగా ఆడేవాడ్ని. సినిమాల్లోకి వచ్చారు షూట్ గ్యాప్ లో ఆడుతున్నా

'లెజెండ్‌' తర్వాత ఓ కొత్త దర్శకుడితో సాహసమే కదా?

'లెజెండ్‌' తర్వాత ఓ కొత్త దర్శకుడితో సాహసమే కదా?

సాహసాలు చేయడం నాకు కొత్త కాదు కాదు. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనాన్ని అందించాలనే చూస్తుంటా. నాన్నగారి నుంచి నేను నేర్చుకొన్నది కూడా అదే. సత్యదేవా ఈ కథని ఐదారేళ్ల కిందటే నాకు చెప్పాడు. అప్పుడు చేసుంటే ఫలితం ఎలా ఉండేదో కానీ ఈ సినిమాకి ఇదే సరైన సమయమని నా నమ్మకం.

ఏడు కేజీలు తగ్గా

ఏడు కేజీలు తగ్గా


'లయన్‌' విషయంలోనూ చిత్ర యూనిట్ చాలా కష్టపడింది. నేను కూడా ఆ పాత్రల విషయంలో చాలా శ్రద్ధ తీసుకొన్నా. గాడ్సే కోసం గెడ్డం పెంచి, 7 కిలోలు బరువు తగ్గి నటించాను. సినిమాలో డ్యాన్సులు, ఫైట్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

బాగా లావుగా ఉండేవాడిని

బాగా లావుగా ఉండేవాడిని

క్రికెట్ కాకుండా చిన్నప్పుడు టేబుల్ టెన్నిస్ లో ...స్కూల్ ఛాంపియన్ ని. సింగిల్స్ లో రన్నరప్ ని, బాస్కెట్ బాల్ టీమ్ కెప్టెన్ ని. కబడ్డీ టీమ్ కు కెప్టెన్ ని. అప్పుడు బాగ లావుగా ఉండేవాడ్ని. కబడ్డిలో ఎంతమందినయినా సునాయిసంగా లాగేసేవాడ్ని.

కథ..జాగ్రత్తలు

కథ..జాగ్రత్తలు

ముందుగా ఆ కథకి నేను కనెక్ట్‌ అవ్వాలి. అందులోని పాత్రలూ ప్రేక్షకులకు చేరువయ్యేలా ఉండాలి. కొత్తదనం ఉండాలి కానీ అది మరీ ప్రేక్షకుల మెదడుని తినేసేలా, వాళ్లని గందరగోళంలోకి నెట్టేలా ఉండకూడదు.

అంతెందుకు..

అంతెందుకు..

'ఆదిత్య 369' సినిమానే తీసుకోండి. అందులో టైమ్‌మెషీన్‌తో చేసిన ప్రయోగాల కంటే శ్రీకృష్ణదేవరాయల పాత్రే ప్రేక్షకులకు బాగా నచ్చింది.

సిబీఐ తో మనకున్న అనుబంధం...

సిబీఐ తో మనకున్న అనుబంధం...

'లయన్‌'లో నాకు బాగా నచ్చింది సీబీఐ అధికారి పాత్రే. సీబీఐతో మనకున్నంత అనుబంధం మరే రాష్ట్రాలకీ లేదేమో (నవ్వుతూ). కొన్నేళ్లుగా ఇక్కడ జరిగిన అవకతవకలు, వాటిపై విచారణల నేపథ్యంలో సీబీఐ అధికారుల్ని టీవీల్లో చూస్తూనే ఉన్నాం. అందుకే కథ, ఆ పాత్ర గురించి చెప్పగానే 'యస్‌... ఇది అందరికీ చేరువయ్యే పాత్ర' అనుకొన్నా. ఇప్పుడదే నిజమైంది.

లక్ష్మి నారాయణ గారిని స్పూర్తిగా...

లక్ష్మి నారాయణ గారిని స్పూర్తిగా...

నా స్నేహితుల్లో కొందరు ఐపీఎస్‌ అధికారులున్నారు. వాళ్ల సలహాలు తీసుకొన్నా. సీబీఐ జేడీగా అందరికీ సుపరిచితులైన లక్ష్మీనారాయణగారినీ స్ఫూర్తిగా తీసుకొన్నా.

 కోపం...ప్రేమ

కోపం...ప్రేమ

క్రమశిక్షణ విషయంలో చాలా పట్టుదలగా ఉంటాను. సినిమా పరిశ్రమలో దేఆర్ ఎట్ మై మెర్శీ. కానీ రాజకీయాల విషయంలో ఐయామ్ ఎట్ దెయిర్ మెర్సీ. కోపం, విసుగు ఏమైనా సరే..అప్పుడున్న పరిస్దతి, ఒత్తిడి కారణంగా వచ్చేవే. అవి అలా వచ్చి ఇలా వెళ్లిపోతూంటాయి.

టైటిల్స్ అన్నీ సింహంతోనే...

టైటిల్స్ అన్నీ సింహంతోనే...

సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, సింహా... ఇప్పుడు లయన్‌.నా సినిమాల పేర్లు ఎక్కువగా 'సింహం'తో ముడిపడి ఉంటాయి. కారణం. నేను స్వతహాగా లక్ష్మీనరసింహస్వామి భక్తుడిని. అదే సమయంలో నేను చేసే పాత్రలు ఎక్కువగా రౌద్రంతో ముడిపడి ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా పేర్లు ఉండాలని అలా నిర్ణయిస్తుంటాం.

శుభ్రంగా తిని ఛద్దాం...

శుభ్రంగా తిని ఛద్దాం...

ఎలాంటి నియమాలు పెట్టుకోను. అప్పట్లో నాన్నగారు కూడా ఎలాంటి నియమాలు పెట్టుకునేవారు కాదు. డయాబెటిక్ అయిన తర్వాత కూడా ఆయన అరెసెలు తినేవారు. ఏంటి నాన్నగారూ...డయాబెటిక్ కదా తినకూడదు అంటే కోరికలు చంపుకుని చావటం ఎందుకు...శుభ్రంగా తిని చద్దాం ...అనేవారు..నేను శుభ్రంగా తింటాను.

నాకు స్పూర్తి ఆయనే...

నాకు స్పూర్తి ఆయనే...

నటుడిగా 40 ఏళ్ల ప్రయాణం మీది. 98 సినిమాలు మీ వెనక ఉన్నాయి. నాన్నే నాకు స్ఫూర్తి. నా గురువు, దైవం అన్నీ ఆయనే. ఎన్టీఆర్‌ వారసుడిగా నాపై చాలా బాధ్యతలున్నాయి. ఒక నటుడిగా మంచి కథల్ని ప్రేక్షకులకు చెప్పాలి, మంచి సందేశాన్ని ఇవ్వాలి. కాలంతో పరిగెత్తడం కాకుండా... మన వెంట కాలం పరిగెత్తేలా ముందు చూపుతో ఆలోచించి నటించాలి. నటుడిగా రకరకాల ప్రయోగాలు చేశానంటే కారణం అదే.

వేరే వాళ్ల సినిమాలు చూడను...

వేరే వాళ్ల సినిమాలు చూడను...

నేను ఎవ్వరి సినిమాలూ చూడను. నాన్న సినిమాల్ని చూస్తే చాలు.. మనసు ఎలా ఉన్నా వెంటనే రీఛార్జ్‌ అవుతుంటాను. మళ్లీ కొత్త ప్రయత్నాలవైపు అడుగులేస్తుంటాను.

విజయశాంతితో...

విజయశాంతితో...

విజయశాంతి, నేనూ చాలా సినిమాల్లో చేసాం. మాది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ . కెమిస్ట్రి బాగుంటుంది. ఒక పాట చేస్తూంటే...నువ్వా..నేనా అన్నట్లు డాన్స్ చేసేవాళ్లం.

కామనే కానీ వారికీ పేరు వస్తుంది

కామనే కానీ వారికీ పేరు వస్తుంది

రమ్యకృష్ణ, రోజా, సిమ్రాన్, నయనతార వీళ్ళందరితో కూడా కెమిస్ట్రీ కుదిరింది. హీరో వర్షిప్ అనేది సినిమాల్లో కామనే కానీ, నా సినిమాల్లో చేసే హీరోయిన్స్ కు కూడా మంచి పేరు వస్తుంది.

ప్రత్యేకమైన కోరికలేలు

ప్రత్యేకమైన కోరికలేలు

నేనెప్పుడూ దేని గురించీ ముందుగా కలలు కనను. ఏదైనా సరే ఆ క్షణంలో జరిగిపోవాలంతే. పాదరసంలాంటి నటుడిని నేను. ఎలాంటి పాత్రలు అప్పజెప్పినా వెంటనే అందులో ఇమిడిపోగలను. అందుకే ఫలానా పాత్ర రావాలి, చేయాలి అని నాకు నేనుగా ఎప్పుడూ ఎదురు చూడను.

చేతినిండా పని..

చేతినిండా పని..

నాకు చేతినిండా పనుండాలండీ. ఒక పక్క నటుడిగా కొనసాగుతూనే మరోపక్క ఎమ్మెల్యేగా, బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ ఛైర్మన్‌గా సేవలు అందిస్తున్నా. ఈ ప్రయాణం చాలా బాగుంది.

మనవడు గురించి...

మనవడు గురించి...

జనరల్ గా మా ఇంట్లో గోల చేసేది నేనే. ఫ్యామిలీ పంక్షన్ అంటే ఖచ్చితంగా నేను ఉండాలని కోరుకుంటారు. ఇంకా బయిట పంక్షన్ లోనూ నా ప్రెజెన్స్ ని కోరుకుంటారు. అంత సందడిగ ఉంటారు. మా కుటుంబంలో నాకు గోల తాత అని పేరు పెట్టారు. ఇప్పుడు నా మనవడి దగ్గర కూడా గోల చేస్తున్నా

వందో చిత్రం గురించి

వందో చిత్రం గురించి

నేను మాత్రం దాని గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఏదైనా వేడివేడిగా అందివ్వడమే నాకు ఇష్టం. ఆ సినిమాపై అభిమానుల అంచనాలు ఉన్న మాట వాస్తవమే. అందుకు తగ్గ కథని ఎంచుకొనే చేస్తా.

మోక్షజ్ఞ ఆరంగేట్రం

మోక్షజ్ఞ ఆరంగేట్రం

2017లో పరిచయం చేద్దామనుకొన్నాం తప్ప ఇక దర్శకుడు ఎవరు? ఎలాంటి కథతో పరిచయం చేయాలి? ఇతరత్రా ఏమీ ఆలోచించలేదు.

మోక్షజ్ఞ ...తాతను మించిన మనవడు అవ్వాలని

మోక్షజ్ఞ ...తాతను మించిన మనవడు అవ్వాలని

కావాలనే ఉంటుంది..కానీ అది కష్టమండి. ఎందుకంటే అప్పట్లో జానపద,పౌరాణి ..ఇలా ఎన్నో నేపధ్యాలు ఉండేవి. దానివల్ల నాన్నగారి తరం ఎన్నో వేవిద్యాలు చేయటనికి కుదిరింది.

నటన విషయంలో సలహాలు

నటన విషయంలో సలహాలు

నా సినిమాలకి సంబంధించి ఎప్పుడైనా తనతో చర్చిస్తుంటా. కొత్తగా ఇలా చేయాలనుకొంటున్నానని చెబుతుంటా. శ్రద్ధగా వింటుంటాడు. అంతే తప్ప తనకి సలహాలు మాత్రం ఏమీ ఇవ్వను.

తాతగా.... ఇంట్లో సందడి

తాతగా.... ఇంట్లో సందడి

మా మనవడు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. తన వల్ల మళ్లీ నా బాల్యాన్ని గుర్తు చేసుకొంటున్నా. నిజంగానే నా వయసు కాస్త తగ్గినట్టు అనిపిస్తోంది. తన రాకతో మా బావగారూ (నారా చంద్రబాబు నాయుడు), నేను మరింత దగ్గరయ్యాం. ఆయనకి ఎన్ని పనులున్నా వూళ్లో ఉంటే తప్పకుండా ఒక్కసారైనా ఇంటికొచ్చి మనవడిని చూసి వెళుతుంటారు.

నర్తన శాలకు ఫుల్ స్టాప్

నర్తన శాలకు ఫుల్ స్టాప్

సౌందర్యగారు, శ్రీహరి గారు లేరు. ఆ పాత్రల్లో ఎవరినీ ఊహించలేం. అందుకుని పూర్తిగ ప్రక్కన పెట్టేసా

100 వ సినిమా గురించి...

100 వ సినిమా గురించి...

బోయపాటి శ్రీను చేసే అవకాసం ఉంది. కథ ఎలా ఉండాలి..సినిమా ఎలా ఉండాలి. అనే విషయం గురించి ఆలోచించాలి. వేడి వేడిగ వడ్డిస్తాం. విచిత్రం ఏమిటంటే..బోయపాటి శ్రీను నాతో మాట్లాడుతున్నప్పుడు నా హావ భావాలను గమనించో, నా మాటలను గమనించో కథ తయారు చేస్తూంటాడు. నా నిజ జీవితం నుంచి పాత్రలు చేసుకుంటాడు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X