బాలకృష్ణ 'లక్ష్మీ నరసింహ'హిందీ రీమేక్ డిటేల్స్
తెలుగులో హిట్టైన సినిమాలన్నీ ఇప్పుడు హిందీలోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో బాలకృష్ణ హీరోగా చేసిన లక్ష్మి నరసింహ చిత్రం కూడా చేరింది. ఈ చిత్రాన్ని సంజయ్ దత్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ ఈ చిత్రంతో తమిళనాట రంగప్రవేశం చేస్తున్నారు. బాలకృష్ణ చేసిన పోలీస్ అధికారి పాత్రను సంజయ్ దత్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తనీందర్ రిటర్న్స్ అనే టైటిల్ పెట్టారు. అలాగే ఈ చిత్రానికి కొలావరి డి పాటతో సంచలనం క్రియేట్ చేసిన అనిరుధ్ రవిచందర్ ని సంగీత దర్సకుడుగా ఎన్నుకున్నారు.
ఈ విషయమై దర్శకుడు దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ...నేను తొలిసారిగా హిందీలో డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇది. సంజయ్ దత్ నా ఫేవరెట్ హీరో. అతన్నే డైరక్ట్ చేయటం ఆనందం గా ఉంది. తమిళ,తెలుగులో సూపర్ హిట్టైన లక్ష్మీ నరసింహా చిత్రాన్ని నేను తెరకెక్కిస్తున్నాను. ఈ చిత్రంలో అమితాబ్ ని ఓ కీలకపాత్రలోకి అడుగుతున్నాం. అయితే ఇంకా అమితాబ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
ఇక అనిరుధ్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్ అవుతుందనుకుంటున్నాను. అతను కొలావరి డి పాట ఎంత సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే కదా. అతనికీ ఇదే తొలి బాలీవుడ్ చిత్రం అవుతుంది. అయితే ఇంకా నిర్మాత,మిగతా సాంకేతికగణం వంటి వివరాలుకు కొద్ది రోజులు ఆగాలి. ఎందుకంటే మేము వాటిని ఖరారు చేసుకునే పనిలో ఉన్నాను. ఈ ప్రాజెక్టుపై సంజయ్ దత్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన తమిళ ఒరిజనల్ చూసి ఇంప్రెస్ అయ్యారు అన్నారు.
అలాగే ఈ చిత్రంలో సంజయ్‌దత్ సరసన ప్రియమణి హీరోయిన్ గా చేయబోతోంది. మొదట ఈ చిత్రం కోసం బాలీవుడ్ భామనే హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు కె.ఎస్.రవికుమార్ అనుకున్నారు. అయితే దక్షిణాది రీమేక్ కావడం వల్ల ఒరిజినాలిటీ వుండాలంటే దక్షిణాది హీరోయిన్ అయితే బాగుంటుందని సంజయ్‌దత్ సలహా ఇచ్చాడు. అంతేకాదు 'పరుత్తివీరన్'లో ప్రియమణి పెర్‌ఫ్మాన్స్‌కు చూసిన సంజయ్‌దత్ హిందీ రీమేక్‌లో హీరోయిన్ గా ప్రియమణి పేరును సూచించాడు. తెలుగులో 'లక్ష్మీనరసింహ'లో అసిన్ కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. హిందీలో ఆ తరహాలోనే సంప్రదాయ యువతి పాత్రలో ప్రియమణి కనిపించబోతోంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











