'లెజెండ్' గుమ్మిడికాయ కొట్టసారు...(ఫోటోలు)
హైదరాబాద్: 'చూడూ... ఒకవైపే చూడూ..' అని ముందే బాలయ్య హెచ్చరించాడు కాబట్టి సరిపోయింది. 'సింహా'లో నందమూరి హీరోని ఒకవైపు నుంచి చూస్తేనే బాక్సాఫీసు హడలెత్తిపోయింది. ఇక రెండో వైపంటే మాటలా..? చిత్రసీమంతా షేక్ అయిపోవాల్సిందే. బోయపాటి శ్రీను ప్రయత్నం కూడా అదే. అందుకేనేమో ప్రతీ అప్ డేట్ ని ప్రతీ అభిమానికి తెలిసేలా గూగుల్ క్రోమ్ ఎక్సటెన్షన్ తో ఇవ్వబోతున్నారు.
'సింహా'కి రెండోవైపు కూడా చూపించి అభిమానుల్ని మురిపిద్దామనుకొంటున్నారు. అందుకే 'లెజెండ్' చిత్రానికి ఆయన 'లయన్ ఈజ్ బ్యాక్' అనే ఉపశీర్షిక పెట్టారు. మరోసారి విందు భోజనం వడ్డించే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి సంభందించి కొత్త పోస్టర్స్ ని విడుదల చేసి క్రేజ్ ని తారా స్ధాయికి తీసుకువెళ్తున్నారు.
'సింహా' కాంబినేషన్ అంటేనే అంచనాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. దానికి తోడు టైటిల్ ఇట్టే ఆకర్షించేస్తోంది. 'లెజెండ్.. బాలయ్యబాబుకి సరిగ్గా సరిపోయే టైటిల్..' అని అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. ఫస్ట్‌లుక్‌లో బాలయ్య అదరగొట్టాడు. మీసం, రాజసం, స్త్టెల్ ఇవన్నీ ఫ్యాన్స్‌కి బాగా నచ్చాయి. ఇక తెరపై తమ హీరో ఎలా ఉంటాడో..? అని వూహల్లోనే 'లెజెండ్' విశ్వరూపాన్ని దర్శించుకొంటున్నారు.
కొత్త పోస్ట్రర్స్ స్లైడ్ షో లో...

గుమ్మిడికాయ కొట్టేసారు..
ఈ చిత్రం షూటింగ్ నిన్నటితో పూర్తై పోయింది. గుమ్మిడి కాయ కొట్టినప్పుడు ఫోటో ఇది. చివరగా ఐటం సాంగ్ ని చిత్రీకరించారు.సోనాలి చౌహాన్, హంసా నందిపై అన్నపూర్ణలో ఈ పాటను షూట్ చేసారు.

రొమాంటిక్ యాంగిల్...
బాలయ్య అంటే యాక్షన్.. బాలయ్య అంటే అదిరిపోయే డైలాగ్స్.. బాలయ్య అంటే మైమరపించే పాటలు.. - ఇవన్నీ మిళితం చేసి... తన స్త్టెల్ చూపించారు బోయపాటి శ్రీను. అందుకే 'సింహా' వసూళ్లు కొల్లగొట్టింది. ఇప్పుడు 'లెజెండ్' కోసం ఆ డోసు పెంచేశారు. వీటితో పాటు బాలయ్యలోని రొమాంటిక్ కోణాన్ని ఆయన బయటకు తీసుకొస్తున్నారట.

పాటలు అదుర్స్...
దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బాణీలిచ్చారు. మాస్, క్లాస్ మేళవింపుతో సాగే ఈ ఆల్బమ్ బాలయ్య చిత్రాల్లోనే మేటిగా నిలబడిపోతుందని చిత్రబృందం నమ్మకాలు పెంచుకొంది. దానికి తోడు ఐటెమ్ పాట అదిరిపోయే లెవల్లో ఉందట. ఈ పాటలో బాలయ్యతో పాటు హంసానందిని నర్తించబోతోంది.మొదట బిపాసాని అనుకొన్నారు, చివరి నిమిషంలో హంసా నందినితో ఆ పాటని తెరకెక్కించాలని చిత్రబృందం నిర్ణయించింది.

గూగుల్ క్రోమ్ ఎక్సటెన్షన్ తో ...
ఈ చిత్రానికి సంభందించిన ప్రతీది క్లిక్ దూరంలో ఉంచటానికి మీకు ఇంట్రస్ట్ ఉంటే http://bit.ly/LEGENDary-Chrome-Extension ని డౌట్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రీ బిజినెస్..
బాలయ్య అభిమానులు పండగ చేసుకునే విధంగా రూపొందిందని చెప్పబడుతున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోందని వినికిడి. ట్రేడ్ వర్గాల్లో చెప్పుకుంటున్న దాన్ని బట్టి ఈ చిత్రం దాదాపు 50 కోట్లు వరకూ బిజినెస్ జరుగింది. ఇది బాలయ్య కెరీర్ లో రికార్డే.

బిజినెస్ ఎంతెంత...
నైజాం రైట్స్ ని మల్టీ డైమన్షన్స్ వారు 7.5 కోట్లు ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్నారు. అలాగే సీడెడ్ రైట్స్ ఏడు కోట్లుకి, గుంటూరు రైట్స్ 3.6 కోట్లుకు, నెల్లూరు రైట్స్ 1.6 కోట్లు వరకూ పలికాయని టాక్. ఓవరాల్ థియోటకల్ రైట్స్ 38- 40 వరకూ వెళ్లాయని అంటున్నారు .శాటిలైట్ రైట్స్ తొమ్మిది నుంచి పదికోట్లు వరకూ ఉన్నాయి. 35 కోట్లుతో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్లకు చేరుతుందని సమాచారం.

ప్రతీదీ సంచలనమే...
14రీల్స్ , వారాహి చలన చిత్రం పతాకం సంయుక్త సమర్పణలో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'లెజెండ్'.ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రం డైలాగులు, ప్రోమోలు సంచలనం సృష్టిస్తున్నాయి

నిర్మాత మాట్లాడుతూ...
''శక్తివంతమైన నాయకుడికి ప్రతిరూపంగా బాలకృష్ణ ఇందులో కనిపిస్తారు. ప్రస్తుత సమాజ స్థితిగతుల్ని సునిశితంగా పరిశీలించి దర్శకుడు ఈ కథని సిద్ధం చేసుకున్నారు. బాలకృష్ణను 'సింహా'గా చూపించిన బోయపాటి మరోసారి ఆ స్థాయిలో చూపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి చక్కటి స్పందన వస్తోంది''అన్నారు.

మూడు గెటప్ లలో..
''బాలకృష్ణని ఓ కొత్త తరహాలో చూపిస్తున్నాం. ఆయన మూడు గెటప్పుల్లో కనిపిస్తారు. బాలకృష్ణ పలికే ప్రతి సంభాషణ.. అభిమానుల్ని అలరించేలా ఉంటుంది'' అని దర్శకుడు చెప్తున్నారు.

రెండూ క్రేజే...
బాలయ్యతో ‘సింహా' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడవ్వడం, ‘దూకుడు' లాంటి హిట్ తర్వాత నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం... ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి.ఈ చిత్రంలో లో బాలయ్య పాత్రలో రెండు రకాల కోణాలుంటాయని, అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందని సమాచారం.

రాజకీయ భవిష్యత్ కు
పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











