twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లె జెండ్-బామ్ (రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    "ఊరు మారితే బేస్ మారుద్ది, తిండి మారుద్ది...బ్లడ్ ఎందుకు మారుద్దిరా బ్లడీ ఫూల్"... అనే పవర్ ఫుల్ డైలాగులు చెపుతూ బాలకృష్ణ వచ్చేసాడు. అయితే సింహా చిత్రాన్ని దగ్గర పెట్టుకుని జెరాక్స్ తీసినట్లున్న ఈ చిత్రం, ఆ రేంజిలో భావోద్వేగాలను పండించలేకపోయింది. సినిమా మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేసిన దర్శకుడు కాస్త కథకు కూడా చోటిస్తే బావుండేది. అప్పటికీ బాలకృష్ణ లెజండ్ పాత్రలో తన స్టార్ డమ్‌నే కాక, నటనా పటిమను ఉపయోగించి సీన్స్ పండించే ప్రయత్నం చేసారు. సినిమాలో పెద్ద ప్లస్ జగబాబు విలనిజం...తెలుగుకు కొత్త విలన్ దొరికినట్లే. రొమాన్స్, కామెడీ మిస్సైన ఈ చిత్రం ఏ మేరకు అలరిస్తుందనేది చూడాలి.

    దుబాయి ఉండే కృష్ణ(బాలకృష్ణ)..ఇండియాలో వైజాగ్ కి ఓ పెళ్లికి తన ఉడ్‌బి(సోనాల్ చౌహాన్) తో కలిసి వస్తాడు. అక్కడ తన కళ్లెదురుగా నియంతలా తిరిగే జితేంద్ర(జగపతిబాబు) ఓ మనిషిని చంపబోతుంటే అడ్డుకుంటాడు. అక్కడ నుంచి వారిద్దరి మధ్య శతృత్వం ఏర్పడుతుంది. ఆ శతృత్వం ముదిరి తన లవర్ ని కిడ్నాప్ చేసి, కృష్ణ కుటుంబం మొత్తాన్ని చంపేయటానికి జితేంద్ర రెడీ అవుతాడు. అయితే అనుకోని విధంగా జయదేవ్(ఇంకో బాలకృష్ణ) ఎంట్రీ ఇచ్చి కాపాడుతాడు. జయదేవ్‌ని చూసిన జితేంద్ర షాక్ అవుతాడు. ఇంతకీ జయదేవ్ ఎవరు...అతనికీ జితేంద్రకీ విరోధం ఏమిటి...జయదేవ్ కు, కృష్ణకు సంభంధం ఏమిటి అనేది మిగతా కథ.

    సినిమా ప్రారంభంలో వచ్చే యంగ్ బాలకృష్ణ పాత్రపై దర్శకుడు పెద్ద శ్రద్ద పెట్టలేదనిపిస్తుంది. అతని పాత్రకు ముగింపు సైతం కనపడదు. అయితే సినిమాలో లెజండ్ అని ఎత్తుకున్న జయదేవ్ పాత్ర మాత్రం సింహాలో పాత్రని గుర్తు చేసినా చాలా బాగా డిజైన్ చేసారు. అయితే ఆ పాత్ర మీదే పూర్తి దృష్ణి పెట్టడం వల్లనే ఏమో కానీ సెకండాఫ్ మొత్తం ఆ పాత్ర ప్లాష్ బ్యాక్ తో నింపేసారు. అయితే విలన్ జితేంద్ర పాత్రకు, జయదేవ్ పాత్రకు మద్య వచ్చే వైరం పెరిగిన పరిణామ క్రమం సరిగ్గా లేదు. జితేంద్ర చేసే చెడ్డ పనులకు జయదేవ్ పాత్ర ఎప్పుడూ అడ్డుపడుతండటం తప్ప వేరే ఏమీ చెయ్యదు. అందుకోసం తన కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సైతం పణంగా పెట్టడం అంతగా రక్తి కట్టలేదు. అదే సింహా లో అయితే రెండో బాలకృష్ణ పాత్ర సినిమాకు ప్రాణమై నిలిచింది. అతని ప్యామిలీ సీన్స్ సైతం సినిమా సక్సెస్ కు తోడ్పడ్డాయి. ఇక్కడ అదే మిస్సైంది. జయదేవ్ తన మరదలు(రాధికా ఆప్టే)ను పెద్దరికంగా అమ్మా..అంటూంటే...ఆమె వెనకపడి, పెళ్లి చేసుకోవటానికి సిద్దపడుతుంది. దాంతో వీరి రొమాన్స్ పండలేదు. దాంతో సెకండాఫ్ డ్రై గా మారిన ఫీలింగ్ వచ్చింది.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

    బాలయ్య అదుర్స్

    బాలయ్య అదుర్స్

    లెజండ్ లాంటి పాత్రలు బాలకృష్ణ మాత్రమే చేయగలరనేది నిజం. ఆ విషయం ఈ చిత్రంలోని ప్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలు మరోసారి ప్రూవ్ చేస్తాయి. బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ గా ఆ పాత్రను పండించి నిలబెట్టారు.

    హీరోయిన్స్...

    హీరోయిన్స్...

    సినిమా ఫస్టాఫ్ లో వచ్చే హీరోయిన్ సోనాల్ చౌహాన్, సెకండాఫ్ లో వచ్చే రాధికా ఆప్టే...ఇద్దరూ తమ పరిధి మేరకు బాగానే చేసారని చెప్పాలి. అయితే సింహాలో నయనతార చేసిన రేంజిలో చేయలేకపోయిలేకపోయారనేది నిజం.

    దర్శకుడు

    దర్శకుడు

    బోయపాటి శ్రీను మొదట నుంచీ ఎమోషన్స్ మీదే ఆధారపడి సినిమాలు చేస్తూ వస్తున్నారు. అదే కోవలో ఈ చిత్రమూ డిజైన్ చేసారు. దర్శకత్వం వరకూ బాలకృష్ణని చూపించటంలో ఆయన సఫలీకృతుడయ్యారనే చెప్పాలి.

    డైలాగ్స్..

    డైలాగ్స్..

    ఈ సినిమాలో చెప్పకోదగ్గ హైలెట్స్ లో డైలాగ్స్ కూడా ఉన్నాయి. పొలిటికల్ డైలాగ్స్ లో ఎంత పవర్ చూపించారో, సమాజానికి మంచిని చెప్తూ రాసిన డైలాగ్స్ కూడా అదే రేంజిలో ఉద్వేగంగా రాసారు.

    టెక్నికల్ గా...

    టెక్నికల్ గా...

    కెమెరా పరంగా రామ్ ప్రసాద్ పూర్తిగా బాలకృష్ణను రెండు విభిన్నమైన గెటప్స్ లో చూపించటంతో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎడిటింగ్ చూస్తే ఫస్టాఫ్ లో మరింత ట్రిమ్ చేసినా ఇంకా బాగుండేది.

    కథ,కథనం

    కథ,కథనం

    మేకింగ్ పరంగా, భావోద్వేగపరంగా, హీరో బైక్, వెపెన్ లు డిజైన్ చేసిన పరంగానూ దర్శకుడు చాలా జాగ్రత్తలు వహించారు. కానీ కథ,కథనం పరంగా తీసుకోలేదనిపిస్తుంది. ఎత్తుకున్న కథ బాగా పాతకాలం నాటికి అవటం, దానికి తోడు విలన్, హీరో కి మధ్య వచ్చే సంఘర్షణ సీన్స్, వాటి పునాది పడిన సీన్స్ బలంగా లేకపోవటం జరిగింది.

    కామెడీ

    కామెడీ

    సీనిమాలో బ్రహ్మానందం రాగానే జనం పెద్ద ఎత్తున అరిచారు అంటేనే ఆయన కామెడీకు ఉండే ప్రయారిటీ అర్దం చేసుకోవచ్చు. అయితే దర్శకుడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. కేవలం ఫస్టాఫ్ లో స్పేస్ ని ఫిల్ చేయటానికే నాశిరకం కామెడీ బ్రహ్మానందం చేత చేయించారు. బి,సి వర్గాలు ఎంజాయ్ చేస్తారనుకుని డిజైన్ చేసారో ఏమో కానీ..ఆ వర్గాన్ని సైతం ఆకట్టుకున్నట్లు కనపడదు. సెకండాఫ్ లో ఆ రిలీఫ్ సైతం లేదు.

     పాటలు, రీరికార్డింగ్

    పాటలు, రీరికార్డింగ్

    ఆడియో పరంగా పాటలు పెద్దగా హిట్ కాలేదన్నది తెలిసిన విషయమే. అదే తెరపైనా కనపడింది. రీరికార్డింగ్ పరంగా మాత్రం దేవికి మంచి మార్కులే పడతాయి. జగపతిబాబు వచ్చే సీన్స్ లో మంచి ఆర్.ఆర్ ఇచ్చి సీన్స్ లేపారు.

    ఇంటర్వెల్ సూపర్...విలన్ వీక్

    ఇంటర్వెల్ సూపర్...విలన్ వీక్

    సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఊహించని విధంగా ఉండి ప్రేక్షకులను సెకండాఫ్ కోసం ఎదురుచూసేలా చేసింది. ఇక విలన్ గా తొలిసారి చేసిన జగపతిబాబు పాత్రని, ఆహార్యాన్ని కొత్తగా డిజైన్ చేసినా హీరో కన్నా చాలా వీక్ విలన్ గా ప్రెజెంట్ చేసారు. హీరో పాత్రనే గొప్పగా చూపించాలనే తాపత్రయంలో విలన్ ని తగ్గించటంతో సినిమాలో ఎక్కడా ఉత్కంఠ, తర్వాత ఏం జరుగుతుందనేది లేకుండా పోయింది.

    నిర్మాణ విలువలు

    నిర్మాణ విలువలు

    నిర్మాతలు ఈ చిత్రాన్ని చాలా లావిష్ గా ఖర్చు పెట్టి తీసారని ప్రతీ ఫ్రేమ్ లోనూ అర్దమవుతూంటుంది. బోయపాటి సైతం ఆ రిచెనెస్ ని తెరపైకి తెచ్చారు.

     పెద్ద మైనస్...

    పెద్ద మైనస్...

    సినిమా మొత్తం విపరీతమైన హింసతో దర్శకుడు నింపేసాడు. ఎక్కడ చూసినా ఎవరో ఒకరు నరకటం, కుప్పలు కుప్పలుగా శవాలు, రక్తం ఉండటంతో చాలా చోట్ల ఓ రకమైన జుగుప్స కలిగింది.

    ఎవరెవరు...

    ఎవరెవరు...

    చిత్రం: లెజెండ్‌
    సంస్థ: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, వారాహి చలనచిత్రం
    నటీనటులు: నందమూరి బాలకృష్ణ, జగపతిబాబు, సోనాల్‌ చౌహాన్‌, రాధికా ఆప్టే, సితార, రావు రమేష్‌, ఈశ్వరీరావు తదితరులు
    సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
    పాటలు:రామ జోగయ్య శాస్త్రి
    మాటలు: ఎం. రత్నం
    ఛాయాగ్రహణం: సి. రామ్ ప్రసాద్
    యాక్షన్: రామ్-లక్ష్మణ్,కనల్ కణ్ణన్
    ఆర్ట్: ఏయస్ ప్రకాష్
    ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
    నిర్మాతలు: అనిల్‌ సుంకర, గోపీచంద్‌ ఆచంట, రామ్‌ ఆచంట,
    సమర్పణ: సాయి కొర్రపాటి
    విడుదల: 28, మార్చి 2014(శుక్రవారం).

    ఫైనల్ గా ఈ చిత్రం బాలకృష్ణ అభిమానులకు నచ్చే అవకాసం ఉంది. అలాగే పూర్తి హింస ఉండం,వినోదం తక్కువ అవటంతో ఈ చిత్రం ఫ్యామిలీస్ ని తెలియకుండానే దూరం చేసుకున్నట్లు అయ్యింది. అయితే మిగతా విషయాలన్నీ ప్రక్కన పెట్టి కేవలం బాలకృష్ణ పవర్ ఫుల్ ఫెరఫార్మెన్స్ మాత్రం చూడాలనుకునే వారికి మాత్రం మంచి ఆప్షన్.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Balakrishna's film Legend released this Friday with divide talk. Bala Krishna who will be seen in stylish royal look in the movie is playing dual roles pairing up with Radhika Apte and Sonal Chauhan.It should be seen whether the film will impress the film goers and set new collection records at the Box Office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X