విజయవాడలో బాలకృష్ణ 'లెజెండ్' యాత్ర (ఫోటోలు)
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను బుధవారం ఉదయం సినీనటుడు బాలకృష్ణ 'లెజెండ్' సినిమా యూనిట్ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో బాలకృష్ణకు స్వాగతం పలికారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, యూనిట్ సభ్యులను వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అంతకు ముందు రాత్రి లెజెండ్ సినిమా ప్రదర్శిస్తున్న విజయవాడ అన్నపూర్ణ థియేటర్‌లో మంగళవారం రాత్రి మొదటి ఆట సమయంలో చిత్ర యూనిట్‌తో కలిసి లెజెండ్ కథానాయకుడు బాలకృష్ణ సందడి చేశారు. చిత్ర యూనిట్ థియేటర్‌ను సందర్శిస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.
స్లైడ్ షోలో ...ఫోటోలు

ప్రూవ్ చేసింది
మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పు డూ ఆదరిస్తారని 'లెజెండ్' చిత్ర విజయం నిరూపించిందని యువరత్న నందమూరి బాలకృష్ణ అన్నారు.

డైలాగులు చెప్తూ...
'లెజెండ్' థియేటర్‌లో ప్రవేశించిన బాలకృష్ణ స్టేజీపై కలియతిరుగుతూ తన పంచ్ డైలాగులతో అభిమానుల్ని ఉర్రూతలూగించారు.

బాలకృష్ణ మాట్లాడుతూ....
ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్న మాధుర్యాన్ని తన తండ్రి నందమూరి తారకరామారావు కోడలు దిద్దిన కాపురం సినిమా ద్వారా చూపించారని, మళ్ళీ లెజెండ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అలాంటి సెంటిమెంటును ఈ చిత్రంలో నేటి తరం ప్రేక్షకులకుఅందించారన్నారు. చిత్రపరిశ్రమలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన ఎన్టీఆర్ నిజంగా లెజెండ్ అన్నారు.

చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ....
నందమూరి బాలకృష్ణ అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. మీ అభిమానం ఉన్నంత కాలం ఇలాంటి మంచి సినిమాలు బాలకృష్ణతో తీస్తూనే ఉంటానని ప్రకటించారు.

సత్కారం..
గజమాలతో బాలకృష్ణను సత్కరించారు. శాలువా కప్పి మెమోంటో బహుకరించారు. తొలుత థియేటర్ యజమాని ఎ.ఎల్.ఎస్.ఆర్.కుమార్, ఎ. నందుబాబు, మేనేజర్ కృష్ణమోహన్, ఎన్.బి.కె.చారిటీస్ మంచు సురేష్, అభిమాన సంఘం నేతలు నిమ్మగడ్డ ప్రసాద్, శ్రీనివాససింగ్ లెజెండ్ యూనిట్‌కు స్వాగతం పలికారు.

నిరాశ
సినీనటుడునందమూరి బాలకృష్ణ హనుమాన్ జంక్షన్‌లో ఆగకుండా వెళ్లిపోవడం ఆయన అభిమానులకు, తెదేపా కార్యకర్తలకు ఆశాభంగం కలిగించింది. లెజెండ్ సినిమా జైత్రయాత్రలో భాగంగా చిత్ర బృందంతో కలసి మంగళవారం సాయంత్రం రోడ్డు మార్గం ద్వారా ఏలూరు నుంచి విజయవాడ వెళ్తున్నారని తెలుసుకున్న అభిమానులు, తెదేపా నాయకులు ఆయనను ఆపి అభయాంజనేయుని దర్శనం చేయించాలనుకున్నారు.

దండలతో...
సాయంత్రం 5 గంటల నుంచి అభిమానులు ఆయన కోసం వేచి చూడసాగారు. గన్నవరం ఎమ్మెల్యే దాసరి బాలవర్దనరావు, నేతలు చలసాని ఆంజనేయులు, వేములపల్లి శ్రీనివాసరావు, చెన్నుబోయిన శివయ్య, మజ్జిగ నాగరాజు తదితరులు బాలకృష్ణ రాకకోసం దండలతో వేచి చూశారు. సుమారు 7 గంటల సమయంలో వచ్చిన బాలకృష్ణ బస్సు లోపల నుంచే చేతులు వూపుతూ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయారు. ఆయన కోసం తెచ్చిన పూలమాలలను అభయాంజనేయునికి వేసి నాయకులు నిష్క్రమించారు.

లక్ష్మీనరసింహస్వామిని...
గుంటూరు జిల్లా మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామిని సినీనటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లెజెండ్ సినిమా విజయవంతమైన నేపథ్యంలో ఇక్కడి దేవాలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చినట్లు బాలయ్య తెలిపారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకస్వాములు ఆశీర్వచనాలు అందించారు. బాలయ్యను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు


Click it and Unblock the Notifications











