షాక్: 'లయిన్' చిత్రం ప్రొడక్షన్ మేనేజర్ కిడ్నాప్

By Srikanya

హైదరాబాద్: బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'లయిన్' షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ షూటింగ్ స్పాట్ నుంచి కొందరు దుండగలు ప్రొడక్షన్ మేనేజర్, క్యాషియర్ లను ఎత్తుకెళ్లారు. పోలీసులు వెంబడించి వారిని పట్టుకున్నారు. బాధితులు, హయిత్ నగర్ కథనం ప్రకారం ...ఫిల్మ్ సిటీలో బాలకృష్ణ లయిన్ షూటింగ్ జరుగుతోంది. సినిమా నిర్మిస్తున్న ఎస్ ఎల్ వీ కంపెనీ షూటింగ్ కోసం ఫనా ట్రావెల్స్ కు చెందిన కార్లును అద్దెకు తీసుకుంది.

https://www.facebook.com/TeluguFilmibeat

పూర్తి వివరాల్లోకి వెళితే...

గత నెల డిసెంబర్ 31 న షూటింగ్ కోసం తీసుకున్న కార్లు ఒకదానికొకటి ఢీ కొనటంతో పాడైపోయాయి. ఆ కార్లు మరమ్మత్తు చేయించాలని, కార్లు అద్దె కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫనా ట్రావెల్స్ నిర్వాహకులు జూబ్లిహిల్స్ లోని ఎస్ ఎల్ వీ ఆఫీసుకు వెళ్లి గొడవ చేసారు. దాంతో కార్లు మరమ్మత్తులు చేయించి అద్దె చెల్లిస్తామని ఎస్ ఎల్ వీ కంపెనీ వారు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం వేరే కంపెనీ కార్లను అద్దెకు తీసుకుని షూటింగ్ చేస్తున్నారు.

ఈ లోగా ఫనా ట్రావెల్స్ కు చెందిన అక్బర్, ఇమ్రాన్ ఖాన్, ఖాధర్ షరీఫ్, జీసంత్ ఖాన్ లతో పాటు మరో ఇద్దరు రామోజీ ఫిలిం సిటీలో లయిన్ షూటింగ్ జరుగుతున్న చోటకు వచ్చారు. అక్కడే ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ దిలీప్ సింగ్, క్యాషియర్ రాఘవచంద్రలను బలవంతంగా కారు ఎపీ 09 సీసి 1851 లో ఎక్కించికుని సిటీ వైపు బయిలుదేరారు. అదే విధంగా మరో ట్రావెల్స్ కు చెందిన డ్రైవర్ మహేష్ ను సైతం కొట్టి అతని కారుని పట్టుకెళ్లారు.

క్యాషియర్ రాఘవచంద్రను తీసుకువెళ్తున్న కారు హయిత్ నగర్ లోని తొర్రూర్ క్రాస్ రోడ్డు వద్ద ఓ ద్వి చక్ర వాహనాన్ని కొట్టింది. ఈ క్రమంలో రాఘవచంద్ర కారు దిగి పారిపోగా...దిలీప్ సింగ్ లోపలే కూర్చున్నాడు. అదే సమయంలో మరో ట్రావెల్స్ కు చెందిన కారు డ్రైవర్ మహేష్ దుండగులను కారులో వెంబడిస్తూ పోలీసులకు పిర్యాదు చేసారు.

పోలీసులు, మహేష్ కలిసి వనస్ధలిపురం ఫనామా వద్ద దుండగుల కారును అడ్డుకున్నారు. నిందుతులను హయిత్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించారు. భాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమేదు ధర్యాప్తు చేస్తున్నారు.

Balayya's Lion Movie Production Manager Kidnapped

చిత్రం విషయానికి వస్తే...

త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. ఈ చిత్రంలో బాలయ్యలో రెండు కోణాలుంటాయని తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

''ప్రజల క్షేమాన్ని కోరుకునే ఓ ఉన్నత ఉద్యోగి జీవితమిది. నాయకుడంటే ఇలా ఉండాలనేలా బాలకృష్ణ పాత్రను సత్యదేవా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి'' అంటున్నారు నిర్మాత.

ఈ చిత్రంలో బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.

ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకట్‌ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X