ఎన్టీఆర్ బయోపిక్ టైటిల్ మార్చేశారు.. క్రిష్ సంచలన నిర్ణయం!
Recommended Video

ఈ ఏడాది రూపొందుతున్న అంత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రని వెండి తెరపై ఆవిషరించబోతున్న సంగతి తెలిసిందే. బాలయ్య స్వయంగా ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. బడ్జెట్ విషయంలో వెనకడుగు వేయకుండా జనరంజకంగా ఈచిత్రం ఉందని బాలయ్య భావిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శత్వంలో ఈ చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజగా చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

టైటిల్ మార్చేశారు
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ముందుగా ఎన్టీఆర్ అని టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ తోనే ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రానికి 'ఎన్టీఆర్ కథానాయకుడు' అని టైటిల్ మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వెనుక భారీ ప్లాన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

కళ్ళు చెదిరేలా
కొత్త టైటిల్ ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. బాలయ్య అచ్చు గుద్దినట్లు ఎన్టీఆర్ లాగే ఆణువణువూ కనిపిస్తున్నాడు. తన తండ్రి పాత్రలో బాలయ్య పూర్తిగా లీనమైనపోయినట్లు ఈ పోస్టర్ ద్వారా అర్థం అవుతోంది.
సంచలన నిర్ణయం
ప్రతి కథకీ ఓ కథానాయకుడు ఉంటాడు. కానీ కథగా మారే నాయకుడు ఒక్కరే ఉంటారు అంటూ క్రిష్ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరించాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే తొలి భాగానికి ఎన్టీఆర్ కథానాయకుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది.

రెండవ భాగం
ఎన్టీఆర్ సినీరంగ విశేషాలు మొత్తం మొదటి భాగం అంటే ఎన్టీఆర్ కథానాయకుడు లో చూపిస్తారట. రెండవ భాగంలో రాజకీయ రంగానికి సంబందించిన అంశాలు ఉంటాయని అంటున్నారు. సెకండ్ పార్ట్ కు ఎన్టీఆర్ ప్రజానాయకుడు అనే టైటిల్ ప్రచారం జరుగుతోంది.

విడుదల ఖరారు
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర విడుదల తేదీ కూడా చిత్ర యూనిట్ ఖరారు చేసింది. జనవరి 9 న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. చిత్రానికి టైటిల్ మార్చడంతో ఎన్టీఆర్ బయోపిక్ పై అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెరిగింది.


Click it and Unblock the Notifications











